సాఫ్ట్‌బాల్ క్రీడలో సత్తా చాటాలి
సాఫ్ట్‌బాల్ క్రీడలో సత్తా చాటాలి రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ నిరూపించుకోవాలి కరీమాబాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. జయప్రకాష్ కాకతీయ, వరంగల్: హనుమకొండ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు పోటీల్లో రాణించాలని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కరీమాబాద్ ప్రధానోపాధ్యాయుడు బి. జయప్రకాష్ కోరారు. గురువారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా అసోసియేషన్ శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. సాఫ్ట్‌బాల్ కోచ్ పోలేపాక వినయ్‌కుమార్...