శిశు మందిర్‌లపై రాష్ట్ర ప్రభుత్వ చిన్నచూపు!
శిశు మందిర్‌లపై రాష్ట్ర ప్రభుత్వ చిన్నచూపు! కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ విమర్శ కాకతీయ, కరీంనగర్: కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తూ ఎంతోమంది పేద విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడుతున్న సరస్వతీ శిశు మందిర్ పాఠశాలల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. విద్యాసేవలందిస్తున్న సంస్థల పట్ల రాజకీయ ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. కరీంనగర్‌లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో నిర్వహించిన విభాగ్ స్థాయి...