వైభవంగా నాగుల చవితి వేడుకలు
వైభవంగా నాగుల చవితి వేడుకలు నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు పంచామృత కావడులతో స్వామివారికి అభిషేకాలు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న మహిళా భక్తులు కాకతీయ, గీసుగొండ: నాగుల చవితి పర్వదినం సందర్భంగా ఊకల్లోని శ్రీ వల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం ఆలయ ప్రధానార్చకులు సముద్రాల సుదర్శనాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల దీక్షలు చేపట్టిన స్వాములు కావడుల్లో తీసుకొచ్చిన పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు చేసి, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు....