మెట్టుగుట్టపై వైభవంగా నాగుల చవితి వేడుకలు

మెట్టుగుట్టపై వైభవంగా నాగుల చవితి వేడుకలుశ్రీ సుబ్రహ్మణ్యస్వామికి ఫల పంచామృత అభిషేకాలు కాకతీయ, హ‌న్మ‌కొండ‌ : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వరంగల్‌ మెట్టుగుట్టపై నాగుల చవితి వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. కుజ, కాలసర్ప దోషాలతో బాధపడుతున్న సర్వజనుల సంక్షేమం, లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉదయం 9 గంటలకు ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి ఫల పంచామృతాలతో అభిషేకం చేశారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శివకేశవులకు ఆకాశ దీపోత్సవం...