భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న మహిళలు కుటుంబ సౌభాగ్యం,ఆయురారోగ్యాలు కోరుతూ నాగదేవతకు ప్రత్యేక పూజలు కాకతీయ,రాయపర్తి : హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పర్వదినాల్లో ఒకటైన నాగుల చవితి వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో ఉదయం నుంచే స్థానిక మహిళలు,యువతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.పుట్టల వద్దకు చేరుకున్న మహిళలు పసుపు కుంకుమలతో పుట్టను అలంకరించి, భక్తితో నాగదేవతకు పాలు,గుడ్లు,అరటిపండ్లు, తాంబూలం నైవేద్యంగా సమర్పించారు.కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు,సర్వవిధ శ్రేయస్సును...