హరీశ్‌రావును కలిసిన ఉపసర్పంచ్ విజయ్‌కుమార్‌

హరీశ్‌రావును కలిసిన ఉపసర్పంచ్ విజయ్‌కుమార్‌ కాకతీయ, శంకరపట్నం: పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సూచించినట్లు కేశవపట్నం గ్రామ ఉపసర్పంచ్‌, కరీంనగర్‌ జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఆకుబత్తిని విజయ్‌కుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసంలో శుక్రవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శంకరపట్నం మండలంలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని హరీశ్‌రావు సూచించినట్లు విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో...