బాలలు రోల్ మోడల్‌గా ఎదగాలి : కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
బాలలు రోల్ మోడల్‌గా ఎదగాలి : కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి కాకతీయ, హనుమకొండ : బాలలు తమకు తామే ఆదర్శంగా నిలవడంతో పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా ఎదగాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు. శనివారం హనుమకొండ సుబేదారిలోని అసుంత నిలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను అభినందించారు. పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, తమ సమస్యలను అధికారులకు నిర్భయంగా తెలియజేయాలని...