నేటి నుంచి ఏనుమాముల మార్కెట్ యథావిధిగా!
నేటి నుంచి ఏనుమాముల మార్కెట్ యథావిధిగా! కేసు ఉపసంహరణపై ఒప్పందం.. మూడు గంటల చర్చల అనంతరం ప్రకటన ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావాలని మార్కెటింగ్ శాఖ విజ్ఞప్తి కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. మంగళవారం నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగనున్నట్లు మార్కెటింగ్ శాఖ ప్రకటించింది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావాలని కోరింది. అడ్తి సెక్షన్ ప్రెసిడెంట్ లింగారెడ్డిపై నమోదైన కేసు ఉపసంహరణ అంశంపై ఒప్పందం కుదరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం...