పన్నుల వసూళ్ల సొమ్ము పక్కదారి
పన్నుల వసూళ్ల సొమ్ము పక్కదారి వసూలైన మొత్తాన్ని 24 గంటల్లో ఖజానాలో జమ చేయాలి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : కమిషనర్ టి. వెంకన్న కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండా వ్యక్తిగత అవసరాలకు వినియోగించిన ఘటనపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న సీరియస్ అయ్యారు. ఇకపై ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల రూపంలో వసూలైన ప్రతి రూపాయిని 24 గంటల్లో ఖజానాలో జమ...