విద్యార్థుల పోరాట ఫలితమే జీవో 97 రద్దు

విద్యార్థుల పోరాట ఫలితమే జీవో 97 రద్దు ఐటీఐ, ఏటీసీ విద్యార్థుల విషయంలోనూ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ కాకతీయ, హనుమకొండ : పాలిటెక్నిక్‌ విద్యార్థుల ఐక్య పోరాట ఫలితంగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం జీవో నంబర్‌ 97ను వెనక్కి తీసుకుందని ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ అన్నారు. సోమవారం వరంగల్‌లో బీఆర్ఎస్వీ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జీవో రద్దు సంబరాల్లో ఆయన పాల్గొన్నారు....