నూతన ఎస్సై నరేష్ రెడ్డికి టీడీపీ నాయకుల శుభాకాంక్షలు
నూతన ఎస్సై నరేష్ రెడ్డికి టీడీపీ నాయకుల శుభాకాంక్షలు కాకతీయ,శంకరపట్నం:కేశవపట్నం పోలీస్స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన నంది రెడ్డి నరేష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు, మానకొండూర్ నియోజకవర్గ టీడీపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మోరే ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ రెడ్డిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కోమల్ రెడ్డి, షాబీర్, కదిరే కొమురయ్య, దసరాపు సాగర్ తదితరులు పాల్గొన్నారు.