ఇనుగుర్తిలో చేయూత పెన్షన్ ప్రారంభించిన ఎమ్మెల్యే
ఇనుగుర్తిలో చేయూత పెన్షన్ ప్రారంభించిన ఎమ్మెల్యే త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయిస్తా.. :ఎమ్మెల్యే డా.మురళి నాయక్ కాకతీయ,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రం లోని రైతు వేదికలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ మంగళవారం పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హులైన...