ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలి.. తహసీల్దార్‌కు బీజేపీ నాయకుల వినతి కాకతీయ,శంకరపట్నం:మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శంకరపట్నం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా అధికారులు...