ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి :తహసీల్దార్ కాకతీయ, పెద్దవంగర :ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్, ఎంపిడిఓ లు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అర్హత కలిగిన ప్రతి కుటుంబం వినియోగించుకోవాలన్నారు. ఈనెల 19వ తేదీ నుంచి మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలలో దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ పథకం కింద మండలంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించబడుతుందని, కుటుంబంలో జీవనోపాధికి...