వరంగల్‌ చెత్తపై శాస్త్రీయ అధ్యయనం!

వరంగల్‌ చెత్తపై శాస్త్రీయ అధ్యయనం! జీడబ్ల్యూఎంసీ–ఎంఎస్ఎస్ఆర్ఎఫ్‌ సంయుక్తంగా వేస్ట్‌ ఆడిట్‌కు శ్రీకారం 90 ఇళ్లతో పాటు వాణిజ్య, ప్రభుత్వ సంస్థల్లోనూ సర్వే కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : వరంగల్‌ నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణను మెరుగుపరిచేందుకు శాస్త్రీయ అధ్యయనానికి జీడబ్ల్యూఎంసీ, చెన్నైకి చెందిన ఎం.ఎస్‌. స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్‌) గురువారం శ్రీకారం చుట్టాయి. వెల్‌కమ్‌ ట్రస్ట్‌ (యూకే) ఆర్థిక సహకారంతో, ఐఐటీ మద్రాస్‌, శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌ భాగస్వామ్యంతో నాలుగేళ్ల పరిశోధన కార్యక్రమం చేపట్టారు. యూఎన్‌-హాబిటాట్‌ రూపొందించిన వేస్ట్‌ వైజ్‌ సిటీస్‌ టూల్‌...