సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యాఖ్యలు సరికాదు!
సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యాఖ్యలు సరికాదు! పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేసేలా వ్యవహరిస్తే సహించం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ డిమాండ్ కాకతీయ, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై పదేపదే విమర్శలు చేయడం ద్వారా ఎవరికి లబ్ధి చేకూర్చాలని చూస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాపాలన కోసం వేలాది మంది కార్యకర్తలు జైళ్లకు వెళ్లి, అరెస్టులు ఎదుర్కొని పదేళ్ల పాటు పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని...