దీక్షా దివస్ సభ విజయవంతానికి కేశవపట్నంలో సన్నాహక సమావేశం
దీక్షా దివస్ సభ విజయవంతానికి కేశవపట్నంలో సన్నాహక సమావేశం కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాకతీయ,శంకరపట్నం:ఈ నెల 29న అల్గునూర్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో, కేశవపట్నంలోని మాధవ సాయి గార్డెన్స్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరై, సభ...