epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఐడీఓసీలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు

ఐడీఓసీలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు
ఓటు హక్కుపై యువతలో అవగాహనే లక్ష్యం
బీఎల్ఓల ముగ్గులు, విద్యార్థుల పోటీలు ఆకర్షణ

కాకతీయ, కొత్తగూడెం : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా ఐడీఓసీ ప్రాంగణంలో బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలు) నిర్వహించిన ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించే విధంగా రూపొందించిన ముగ్గులు అందరి మన్ననలు పొందాయన్నారు.

విద్యార్థులకు ప్రశంసలు, సన్మానాలు

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేసి అభినందించారు. చిన్న వయసులోనే ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగగలరని ఆయన అన్నారు. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్న బూత్ లెవల్ అధికారులకు అవసరమైన కిట్లను కలెక్టర్ అందజేశారు.

ఉత్తమ అధికారులకు ఘన సత్కారం

ఎన్నికల విధుల్లో ప్రతిభ కనబరిచి ఉత్తమ ఎలక్టోరల్ అధికారులుగా ఎంపికైన తాసిల్దార్లు, జిల్లా మాస్టర్ ట్రైనర్‌లకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్లను ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాజంలోని ప్రతి వర్గం భాగస్వామ్యమేనని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.

ఓటు హక్కుపై ప్రతిజ్ఞ

ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, విద్యార్థులు, నూతన ఓటర్లు సహా అందరితో ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహనను మరింత పెంచాయని కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, తాసిల్దార్లు పుల్లయ్య, ధార ప్రసాద్, జిల్లా మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ, సంబంధిత శాఖల అధికారులు, విద్యార్థులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్లు, నూతన ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.