epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చేర్యాల రెవెన్యూ డివిజన్ లక్ష్యంగా తీర్మానాలు చేయాలి

చేర్యాల రెవెన్యూ డివిజన్ లక్ష్యంగా తీర్మానాలు చేయాలి

* చేర్యాల పట్టణ ప్రజలే పాలకవర్గానికి అధిష్టానం

* జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్

కాకతీయ,చేర్యాల : చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడమే ఏకైక లక్ష్యంతో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గం తీర్మాణం చేసి ప్రభుత్వానికి అందజేయాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ సూచించారు. శుక్రవారం జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 9న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి 45మంది అభ్యర్థులు పోటీలో పాల్గొన్నారని, కేవలం 12 మందిని మాత్రమే కౌన్సిలర్లను పరిపాలన కోసం పంపించారన్నారు. ఆయా పార్టీలు బీఫాములు ఇచ్చినప్పటికీ 12 మందిని మాత్రమే ఆచితూచి ఏరి కోరి కౌన్సిలర్లు గా ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజలే మీకు అధిష్టానం అని భావించి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజల ఆశయం కోసమే పని చేయాలి తప్ప మీ పార్టీల ప్రయోజనం కోసమే, మీ నాయకుల మెప్పు కోసమో పనిచేయకూడదని సూచించారు. అందులో భాగంగానే ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయినటువంటి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం మొదటి కౌన్సిల్ సమావేశంలోనే తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని తెలిపారు. అలాగే చేర్యాల పట్టణానికి ల్యాండ్ మార్కు అయినటువంటి పట్టణం నడిబొడ్డున గతంలో ఉన్నటువంటి గ్రామపంచాయతీ స్థలంలోనే మున్సిపల్ కార్యాలయాన్ని నిర్మించాలని, అంతేకాకుండా నిజాం ప్రభుత్వం నుండి ఉన్నటువంటి ఆస్పత్రిలో బస్తీ దవాఖాన గా మార్చి కొనసాగించాలన్నారు. గత పాలకవర్గంలో జరిగినటువంటి తప్పిదాలను సరిదిద్దే క్రమంలో ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారుల కుటుంబాలు చిన్న భిన్నం అయ్యారని, వారికి పునరావసం కల్పించడానికి షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించాలని కోరారు. మేము ఎలాంటి జీతభత్యాలు కానీ గౌరవ వేతనాలు లేకుండా స్వయం ప్రకటిత చౌకీదర్ నని అన్నారు. ఎలాంటి భేషాజాలకు అనుమానాలకు తావులేదని మా చివరి ఊపిరి ఉన్నంతవరకు చేర్యాల ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష కోసం ఆత్మగౌరవం కోసం పనిచేస్తానని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలతోటి సంబంధం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, నాయకులు ఈ ప్రాంతాన్ని విస్మరిస్తే ఎంతటి వారినైనా జేఏసీ ప్రశ్నిస్తుందని పేర్కొన్నారు. రేపటి రోజుల్లో జేఏసీని మరింత పటిష్ట పరిచి 2026 లోపు రెవెన్యూ డివిజన్ సాధించడం కోసం మడమ తిప్పని పోరాటం చేస్తున్నామని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు జేఏసీలో భాగస్వాములై కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు అందె అశోక్, అందె బీరయ్య, బుట్టి సత్యనారాయణ, తాడెం వెంకట స్వామి, సుందరగిరి భాస్కర్, ఈరి భూమయ్య, బోదాసు మైసయ్య, రామగళ్ల నరేష్, బెల్లపు నరేష్, ఉప్పల రాములు, గుండె ఉదయ్, పిల్లి చంద్రం, పోలోజు వెంకటాద్రి, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.