epaper
Wednesday, October 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప‌ట్నానికి అడవి బిడ్డలు

ప‌ట్నానికి అడవి బిడ్డలు

పర్యాటక రంగంలో ప్రయోగం ‘రివర్స్ టూరిజం’

‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ కు శ్రీకారం

జెండా ఊపి ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

ఆదివాసీలతో కలిసి బస్సులో ప్రయాణం

ఉట్నూరు నుంచి హైదరాబాద్ 250 మంది అడవి బిడ్డలు

తారామతి బారదరిలో పర్యాటకశాఖ స్వాగ‌తం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పర్యాటక రంగ చరిత్రలో సరికొత్త ఒరవడికి నాంది పడింది. కేవలం నగరవాసులు ప్రకృతిని చూడటానికి పల్లెలకు వెళ్లడమే కాకుండా, అడవి బిడ్డలు సైతం ఆధునిక అభివృద్ధిని, చారిత్రక వైభవాన్ని కళ్లారా చూడాలన్న సంకల్పంతో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ‘రివర్స్ టూరిజం’కు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గోండు గూడెంలో బుధవారం నిర్వహించిన ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ను మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఆదివాసీలకు కొత్త అనుభవాలు ఇవ్వడం, నగర జీవన విధానం పరిచయం చేయడం, ఆత్మవిశ్వాసం పెంచడం, రెండు సంస్కృతుల మధ్య అవగాహన పెంచడం, సాంస్కృతిక మార్పిడి, అంతిమంగా ఆదివాసీల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు వివరించారు.

ఆదివాసీలతో మమేకమైన మంత్రి

కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాకుండా, మంత్రి జూపల్లి స్వయంగా ఆదివాసీలతో కలిసి బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రయాణ పొడవునా వారితో ముచ్చటిస్తూ పర్యటన లక్ష్యాన్ని వివరించారు. “బయటి ప్రపంచంతో అనుసంధానం కావడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నగరాల్లోని అభివృద్ధిని చూసి చదువుల పట్ల ఆసక్తి పెంచుకోవాలి. ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలి. అప్పుడే ఆదివాసీల జీవన ప్రమాణాల్లో మార్పులు వస్తాయి” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

నగర నాగరికతకు – సంస్కృతికి వారధి

ఆదివాసీల విశిష్ట సంస్కృతికి, నగర నాగరికతకు మధ్య ఈ కార్యక్రమం ఒక వారధిలా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. 5 ప్రత్యేక బస్సుల్లో బయలుదేరిన 250 మంది ఆదివాసీలు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తారామతి బారాదరికి చేరుకుంది. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో విమానాశ్రయం, చార్మినార్, గోల్కొండ కోట, లుంబినీ పార్క్, శిల్పారామం వంటి ప్రాంతాలను వీరు సందర్శించనున్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ కామ్డే పాల్గొన్నారు. వీరితో పాటు డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆత్రం సుగుణ, కాంగ్రెస్ నాయకులు ఆత్రం సక్కు, సోయం బాపురావు, ఆడే గజేందర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎల్‌నినోను ఎదుర్కొంటాం

ఎల్‌నినోను ఎదుర్కొంటాం విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు రానివ్వం! డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థ బలోపేతం ఎన్‌పీడీసీఎల్‌...

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు రెండో విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లు పొలాల...

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం!

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం! 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనపై పునఃపరిశీలనకు సీఎం ఫ‌డ్న‌వీస్‌...

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ?

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ? 17 వేల మంది ఉద్యోగుల...

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు!

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు! దేవాదుల, కల్వకుర్తి నుంచి ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు? తమ్మిడిహట్టి...

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా?

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా? ఖర్గే వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఓటర్ల ప్రత్యేక...

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం!

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం! అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా నేలకొండపల్లి 10 రోజుల్లో...

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు రోడ్‌–2 ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు జ‌రిగాయి బినామీల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.