epaper
Wednesday, October 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చోరీల ముఠా అరెస్ట్

చోరీల ముఠా అరెస్ట్
మంగపేటలో వరుస దొంగతనాలకు పాల్పడిన 8మంది అరెస్ట్
బంగారం, వెండి, మూడు బైక్‌లు, నగదు స్వాధీనం
వివ‌రాలు వెల్ల‌డించిన ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్

కాక‌తీయ‌, ఏటూరునాగారం: మంగపేట మండలంలో ఇటీవల వరుస చోరీలతో సంచలనం సృష్టించిన కేసులను పోలీసులు ఛేదించారు. ఈ దొంగతనాలకు పాల్పడిన ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి వారి నుండి బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏటూరునాగారం సీఐ అనుములు శ్రీ‌నివాస్ తెలిపారు. శుక్ర‌వారం మంగ‌పేట పోలిస్ స్టేష‌న్ లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయన ఈ అరెస్ట్ వివ‌రాలను వెల్ల‌డించారు. మంగపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గంపొనిగూడెం, కమలాపురం, బోరనర్సాపూర్ గ్రామాల్లో ఇటీవల పలు చోరీలు చోటుచేసుకోవడంతో ప్రత్యేక నిఘా పెట్టి నిందితులను పట్టుకున్నామన్నారు.

నిందితులంతా పాత నేరస్థులే

అరెస్టైన వారిలో కమలాపురం గ్రామానికి చెందిన నిమ్మల వినయ్‌కుమార్, పరమాత్ముల శివ, బోయి పరశురాం, రాయరకుల సారయ్య, నిమ్మల కుమార్, భూక్య ప్రవీణ్ అలియాస్ బెంజ్, ప్రస్తుతం చిన్నబోయినపల్లిలో ఉంటున్న మహ్మద్ బిజిగిరి మరియు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బండి తరుణ్ ఉన్నారు. విచారణలో నిందితులపై గతంలోనూ పలు దొంగతనాల కేసులు నమోదైనట్లు, వీరంతా జైలు శిక్ష అనుభవించి వచ్చిన పాత నేరస్థులని తేలిందని పోలీసులు వెల్లడించారు. మంగపేట, కొత్తగూడెం, నిజామాబాద్ ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. నిందితుల నుంచి ఒకటిన్నర తులాల బంగారం, 40 తులాల వెండి వస్తువులు, మూడు బైక్‌లు, రూ.10 వేల నగదు, 30 కిలోల రాగి వైరు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వేసవి కాలంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కాగా, కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ అభినందించారు. దర్యాప్తులో ఏటూరునాగారం సీఐ ఎ. శ్రీనివాస్, ఎస్‌ఐలు టీవీఆర్ సూరి, ఎల్. శ్రీకాంత్, కానిస్టేబుళ్లు మోహన్, రమేష్, ప్రసాద్, నరేష్ కీలక పాత్ర పోషించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి కాకతీయ, నెల్లికుదురు: విధుల నిర్వహణలో పోలీసులు...

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : కమలాపురం మండలం...

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన -విబిజీ రాంజీ ఉపాధి పనుల పరిశీలన...

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర... *నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి నామ స్మరణతో...

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలి గవర్నర్‌ కోటాలో అవకాశం కల్పించాలని...

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌ కాకతీయ, గీసుగొండ: పోలీసు...

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య నెల్లికుదురులో రూ.7.50 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌...

పీఆర్‌టీయూ టీఎస్‌లో అశోక్‌కు కీలక బాధ్యత

పీఆర్‌టీయూ టీఎస్‌లో అశోక్‌కు కీలక బాధ్యత రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక 2002...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.