epaper
Friday, October 30, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎవరి కులం ఎంతో… వారికంత వాటా 

ఎవరి కులం ఎంతో… వారికంత వాటా 
: భారీ బహిరంగ సభ కరపత్రం ఆవిష్కరణ
కాకతీయ మలహర్: ధర్మ సమాజ్ పార్టీ మద్దతుతో, బీసీ, ఎస్సీ, ఎస్టీ-జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 26న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను నిర్వాహకులు ఆవిష్కరించారు. ‘సామాజిక న్యాయం – రాజ్యాధికారం’ లక్ష్యంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ-జేఏసీ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ రాదండి దేవేందర్, కో-ఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల ప్రజలు సామాజిక న్యాయం, రాజకీయ భాగస్వామ్యం కోసం ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత వెనుకబడిన వర్గాల జీవితాల్లో కొంత మార్పు వచ్చినప్పటికీ, ఇప్పటికీ పూర్తి స్థాయి సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభాను బట్టి అవకాశాలు దక్కాలని, జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారంలో వాటా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగానే ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, ఈ సభను విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కో-కన్వీనర్లు అజ్మీరా సమ్మయ్య నాయక్, జోగుల సమ్మయ్య, పులిగంటి రాములు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యార్థులకు 21 రకాల వస్తువులు వంద శాతం అందాలి

విద్యార్థులకు 21 రకాల వస్తువులు వంద శాతం అందాలి ఎంఆర్‌సీల్లో ఐటీడీఏ పీఓ...

గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండల సమావేశాలు

గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండల సమావేశాలు అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఆత్మ కమిటీ...

స్వేరో ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేద్దాం

స్వేరో ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేద్దాం నియోజకవర్గ కో- కన్వీనర్ జెల్ల ఉపేందర్ కాకతీయ,...

గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం

గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం విద్యతోపాటు వ్యక్తిగత భద్రతపై అవగాహన అవసరం :...

దుగ్గొండి లో డీపీవో పర్యటన

దుగ్గొండి లో డీపీవో పర్యటన గ్రామ పంచాయతీ రికార్థుల పరిశీలన పారిశుధ్య పనుల...

ఆవిష్కరణలకు వేదిక‌ ‘టెక్నోజియన్‌’

ఆవిష్కరణలకు వేదిక‌ ‘టెక్నోజియన్‌’ నేటి నుంచి ఎన్‌ఐటీ వరంగల్‌లో సాంకేతిక సంబరం రెండు రోజుల...

అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి

అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి పెంచికలపేటలో బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో నమోదు కార్యక్రమం కాకతీయ,...

పెద్ది ఆశయ సాధనకు కదలాలి!

పెద్ది ఆశయ సాధనకు కదలాలి! పట్టభద్రుల ఓటరు నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి కాంగ్రెస్‌కు బుద్ధి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.