epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్ విజయాల‌ను ఎవ‌రూ ఆపలేరు

కాంగ్రెస్ విజయాల‌ను ఎవ‌రూ ఆపలేరు
సాకారం అవుతున్న పేదల కలలు!
ప్రజా ప్రభుత్వంలో హామీల అమలు
గ్రామాలాభివృద్ధే మా ప్ర‌భుత్వం ల‌క్ష్యం
: మంత్రి పొంగులేటి
మరిపెడలో రూ.6.50 కోట్ల పనులకు శంకుస్థాపన

కాకతీయ, మరిపెడ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రజా ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. పేదల కలలు నెరవేరుతున్నాయని, అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతోందని ఆయన తెలిపారు. శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సుమారు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ, బీటీ రోడ్లు, వర్షపు నీటి కాలువలు సహా పలు అభివృద్ధి పనులకు డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్‌తో కలిసి మంత్రి శంకుస్థాపనలు చేశారు.

అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధిని ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని, రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
డోర్నకల్ నియోజకవర్గంలో గత పాలనలో అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని మంత్రి విమర్శించారు. వచ్చే పది ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే విజయం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

సంక్షేమ పథకాలే బలం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విస్తృత మద్దతు తీసుకొస్తాయని మంత్రి అన్నారు. ఈ పథకాలే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేము నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, కాలం రవీందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎస్‌కే తాజుద్దీన్, పానుగోతు రామ్‌లాల్, బంక ప్రమోద్, అన్వర్ పాశా, అఫ్జల్, రవికాంత్, వెంకన్న, వేణు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.