epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నేతల ప్రచార జాతర!

నేతల ప్రచార జాతర!
అమ్మవారిపేటలో నిబంధనలకు విరుద్ధంగా ప్లెక్సీలు
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ప్రజల్లో అసహనం
దేవాలయ పరిసరాల్లో రాజకీయ హంగామా

కాకతీయ, వరంగల్ : జనసందోహం ఎక్కడుంటే అక్కడే ప్రచారం చేయాలన్న రాజకీయ నేతల ఆతృత మరోసారి వివాదానికి దారి తీసింది. వరంగల్ నగరం ఉర్సుగుట్ట ఏరియాలోని అమ్మవారిపేటలో జరుగుతున్న సమ్మక్క జాతర ప్రాంగణంలో కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రచార ప్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర చర్చకు కారణమైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న వేళ, దేవాలయాల సమీపంలో రాజకీయ ప్రచారం చేయకూడదన్న నిబంధనలను విస్మరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతరకు వచ్చిన భక్తులు, స్థానికులు ఈ వ్యవహారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి జాతరను రాజకీయ వేదికగా మార్చడంపై ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలు నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు వినిపిస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ప్రతిపక్షాల అభ్యంతరం..
ప్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఇతర పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికార పార్టీ నేతలతో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలడంతో జాతర ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భక్తులు, మహిళలు ఇబ్బందులకు గురయ్యారని స్థానికులు పేర్కొంటున్నారు.

సీఐ కిషన్ చొరవతో సద్దుమణిగిన వివాదం..!

వివాదం తీవ్రతరమవుతుండటంతో సమాచారం అందుకున్న సీఐ కిషన్ అమ్మవారిపేటకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరు వర్గాల నాయకులను సముదాయించి, ఎన్నికల కోడ్ పాటించాలని సూచించారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై జీడబ్ల్యూఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ రవీంద్ర డీ. రాడేకర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించినా స్పందన రాలేదని సమాచారం. ఎన్నికల వేళ దేవాలయాలు, జాతరల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.