epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జాతరలో పవర్ కట్‌కు ఎవరు బాధ్యులు?

జాతరలో పవర్ కట్‌కు ఎవరు బాధ్యులు?
కొత్త కాంట్రాక్టర్ ప్రయోగమే శాపమా?
రాష్ట్రస్థాయి జోక్యమే కొంపముంచిందా?
తీరా ఇప్పుడు కిందిస్థాయి అధికారులను బ‌లి చేయాల‌ని చూస్తున్నారా..?

కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా, తెలంగాణ రాష్ట్ర కుంభమేళాగా పేరుగాంచిన శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో ఈసారి విద్యుత్ శాఖ తీవ్ర విమర్శల పాలైంది. రాష్ట్ర ప్రభుత్వం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోట్ల రూపాయలు ఖర్చు చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ, అత్యంత కీలకమైన విద్యుత్ సరఫరాలో మాత్రం ఘోర వైఫల్యం చోటుచేసుకుందని భక్తులు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా ఏర్పాట్లు చేశామని జాతర ముందస్తు ప్రచారంలో ప్రకటించిన విద్యుత్ శాఖ అధికారులు, జాతర జరుగుతున్న సమయంలోనే పలుమార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో విమర్శల పాలయ్యారు. ఈ పవర్ కట్ ఘటనలు ఇప్పుడు అధికార వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారాయి.

రాత్రివేళల్లోనే కరెంటు కట్… భక్తుల్లో భయం

జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటివరకు నిర్వహించిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో రాత్రి వేళల్లో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సమయంలో క్యూలైన్ల వద్ద గందరగోళం నెలకొనగా, కొన్ని చోట్ల తోపులాటలు చోటుచేసుకున్నాయి. భక్తుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మంత్రి కాన్వాయ్‌పై దాడి ఘటన, దొంగతనాల ఆరోపణలు, గుడారాల ప్రాంతాల్లో గంటన్నర పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి పరిణామాలు విద్యుత్ వైఫల్యానికి నిదర్శనాలుగా మారాయి. తాత్కాలికంగా జనరేటర్లను వినియోగించినా, డీజిల్ అయిపోతుందన్న భయంతో అధికారులు ఆందోళనకు గురయ్యారని సమాచారం. చివరి నిమిషంలో విద్యుత్ పునరుద్ధరించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈసారి మేడారం జాతరలో తీసుకున్న కాంట్రాక్టర్ నిర్ణయమే పవర్ కట్‌లకు ప్రధాన కారణమన్న అభిప్రాయం విద్యుత్ శాఖలోనే వినిపిస్తోంది. గతంలో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లతో పనులు చేయించడంతో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, ఈసారి వారిని పక్కనపెట్టి కొత్త కాంట్రాక్టర్‌కు కీలక పనులు అప్పగించడమే సమస్యలకు మూలమని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రస్థాయి అధికారి సిఫారసుతో హైదరాబాద్‌కు చెందిన కొత్త కాంట్రాక్టర్‌కు దాదాపు కోటి రూపాయలకు పైగా విలువైన పనులు అప్పగించినట్టు సమాచారం. అనుభవం లేని కాంట్రాక్టర్, మేడారం భౌగోళిక పరిస్థితులు, లక్షలాది భక్తుల రద్దీని అంచనా వేయడంలో విఫలమవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కిందిస్థాయి అధికారులే బలిపశువులా?

పవర్ కట్ ఘటనలపై కిందిస్థాయి అధికారులపై చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే అసలు కారణం పై స్థాయి నిర్ణయాలే అయినప్పటికీ, బాధ్యతను జిల్లాస్థాయి అధికారులపై నెట్టివేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పై స్థాయి జోక్యంతో ఏర్పడిన సమస్యలకు కిందిస్థాయి సిబ్బందిని బలిపశువులుగా చేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోటికి పైగా భక్తులు తరలివచ్చే మేడారం మహా జాతరలో విద్యుత్ అంతరాయం అంటే కేవలం అసౌకర్యం కాదు… అది భక్తుల భద్రతకు ముప్పు. అనుభవాన్ని పక్కనపెట్టి ప్రయోగాల పేరుతో తీసుకున్న నిర్ణయాలు భక్తుల ప్రాణాలతో చెలగాటమాడినట్టేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి నిజంగా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటుందా? లేక చర్యలు కిందిస్థాయి అధికారులకే పరిమితం అవుతాయా? అన్నది వేచి చూడాల్సిందే.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.