epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైతేడ్చిన రాజ్యం బాగుండదు

రైతేడ్చిన రాజ్యం బాగుండదు
కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి అరిగోస
రాష్ట్రంలో దుష్ట పాలన కొన‌సాగుతోంది
మళ్లీ కరువు ఛాయలు కనిపిస్తున్నాయి
కాంగ్రెస్ ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిల‌బెట్టుకోలేదు
శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వ‌జం
రేవంతు.. రైతుబంధు ఏమైంది? : ఎర్రబెల్లి దయాకర్ రావు
మొక్కజొన్న కొనుగోళ్లు లేక కర్షకుల ఆవేదన : మాజీ మంత్రి రెడ్యా
6న పాలకుల నిద్ర మత్తు వదిలిస్తాం: పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

కాకతీయ, వరంగల్ బ్యూరో : “ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అన్నదాతల పరిస్థితి అలాగే ఉంది” అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. సాగునీరు, విద్యుత్, యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై సమరశంఖం పూరించాలని నిర్ణయించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత దుష్టమైన పాలన సాగిస్తోందని మధుసూదనాచారి మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో భూగర్భ జలాలు పెరిగి సాగునీరు పుష్కలంగా అందేదని, ఇప్పుడు మళ్లీ కరువు ఛాయలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని, రైతులు గత పాలనను, ఇప్పటి పరిస్థితులను పోల్చి చూడాలని కోరారు.

మొక్కజొన్న రైతుల కడుపు కొడుతున్నారు : రెడ్యా నాయక్
మహబూబాబాద్ మార్కెట్‌లో దాదాపు 2 లక్షల బస్తాల మొక్కజొన్న పేరుకుపోయినా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని మాజీ మంత్రి రెడ్యా నాయక్ ఆరోపించారు. మద్దతు ధర కంటే వెయ్యి రూపాయలు తక్కువకు అమ్ముకోవాల్సి రావడంతో రైతులు కుదేలవుతున్నారని, ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రకటించిన ‘రైతు డిక్లరేషన్’ అమలులో డొల్లతనాన్ని ఎండగట్టేందుకు మే 6న వరంగల్‌లో భారీ ‘రైతు సదస్సు’ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభకు అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. జిల్లా ఇన్-చార్జ్ మంత్రి కేవలం కాంట్రాక్టుల రివ్యూలకే పరిమితమయ్యారని, ప్రజా సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు.

రైతుబంధు ఏమైంది?: ఎర్రబెల్లి దయాకర్ రావు
బీఆర్ఎస్ హయాంలో పండుగలా సాగిన వ్యవసాయం.. నేడు కాంగ్రెస్ రాకతో భారంగా మారిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. రైతుబంధు నిధులు సకాలంలో అందక, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. తక్షణమే అన్నదాతలను ఆదుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నర్సింహులపేట వంటి ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోళ్లలో భారీ అవినీతి జరుగుతోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించకుండా మంత్రులు ప్రచారానికే పరిమితమయ్యారని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్ తదితరులు పాల్గొని తమ గళాన్ని వినిపించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.