epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితి విషమం

  • మెదడు స్పందనపై వైద్యుల ఆందోళన
  • 72 గంటల తర్వాత మరోసారి న్యూరోలాజికల్ అంచనా
  • యశోద హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం ఆయన అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, గుండె, శ్వాస సంబంధిత పరిస్థితి వైద్యుల పర్యవేక్షణలో స్థిరంగా ఉన్నప్పటికీ మెదడు స్పందన ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. హెల్త్ బులెటిన్ ప్రకారం పెద్ది సుదర్శన్ రెడ్డి తొలుత వరంగల్‌లోని రోహిణి ఆస్పత్రికి తీవ్ర పల్మనరీ ఎంబాలిజం (ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం) స‌మ‌స్య‌ను ఎదుర్కొన్నారు. గుండె ఆగిపోవడంతో సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్, అడ్వాన్స్‌డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ (ఏసీఎల్ఎస్‌) చికిత్స నిర్వహించిన అనంతరం గుండె స్పందన పునరుద్ధరించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం వరంగల్‌లో థ్రాంబోలిసిస్ చికిత్స అందించి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ క్రిటికల్ కేర్, పల్మనరీ, కార్డియాలజీ, న్యూరాలజీ నిపుణులతో కూడిన బృందం చికిత్స అందిస్తోంది. వెంటిలేటర్ సాయంతో శ్వాస అందిస్తూ అవసరమైన మందులు, ఇతర చికిత్సలు కొనసాగిస్తున్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. అయితే గుండె ఆగిన సమయంలో సుదీర్ఘంగా మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో మెదడు దెబ్బతిన్నట్లు (అనాక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్) ఈఈజీ, ఎంఆర్ఐ, సీటీ స్కాన్ పరీక్షల్లో సంకేతాలు కనిపించినట్లు వైద్యులు వెల్లడించారు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మాటలకు గానీ, నొప్పికి గానీ అర్థవంతమైన న్యూరోలాజికల్ స్పందన కనిపించలేదని తెలిపారు. అంతర్జాతీయ వైద్య మార్గదర్శకాల ప్రకారం 72 గంటల తర్వాత మరోసారి న్యూరోలాజికల్ పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితిపై తుది అంచనా వేస్తామని యశోద ఆస్పత్రి యాజ‌మాన్యం పేర్కొంది. రోగి ఆరోగ్య పరిస్థితి, చికిత్స పురోగతిపై కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.