- బల్దియా సీఎంహెచ్ వోకు అదనపు బాధ్యతలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ వో) గా డాక్టర్ రాజారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజారెడ్డి ప్రస్తుతం వరంగల్ మహానగర పాలక సంస్థ సీఎంహెచ్ ఓగా పని చేస్తున్నారు. వరంగల్ డీఎంహెచ్ వోగా పని చేస్తున్న సాంబశివరావు పలు కారణాలతో విధులకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను ప్రజారోగ్య శాఖకు రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వరంగల్ డీఎంహెచ్ వోగా రాజారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటీ రెండు రోజుల్లో రాజారెడ్డి డీఎంహెచ్ వో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

