epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జనసంద్రంగా నర్సంపేట… అశ్రునయనాలతో పెద్ది అంతిమయాత్ర

జనసంద్రంగా నర్సంపేట… అశ్రునయనాలతో పెద్ది అంతిమయాత్ర
తెలంగాణ ఉద్యమ యోధుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం
స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపార వర్గాలు
భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్న అభిమానులు
శుక్రవారం సాయంత్రం స్వగ్రామం నల్లబెల్లిలో అంత్యక్రియలు

కాకతీయ, నర్సంపేట: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు నర్సంపేట జనసంద్రంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు, ఉద్యమ సహచరులు, రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు నర్సంపేటకు తరలివస్తున్నారు. ఎటు చూసినా జనసందోహమే కనిపిస్తుండగా, పట్టణమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.


పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని చివరిసారి చూసేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. ఆయనతో కలిసి ఉద్యమంలో నడిచిన సహచరులు, అభిమానులు, సాధారణ ప్రజలు భావోద్వేగానికి గురై కన్నీరుమున్నీరవుతున్నారు. “ప్రజల మనిషిని కోల్పోయాం”, “ఉద్యమ యోధుడు ఇక లేరు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెద్ది మృతికి నివాళిగా నర్సంపేట పట్టణంలోని వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేసి ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా అంతిమయాత్రలో పాల్గొనేందుకు తరలిరావడంతో నర్సంపేట పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జనంతో నిండిపోయాయి.


రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, ఉద్యమకారులు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు, అభిమానులు పెద్ది భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను, నర్సంపేట ప్రజలతో ఆయనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం ఆయన స్వగ్రామమైన నల్లబెల్లిలో నిర్వహించనున్నారు. అంతిమయాత్రలో పాల్గొనేందుకు వేలాదిమంది ఇప్పటికే నల్లబెల్లికి చేరుకుంటుండగా, ఓరుగల్లు గడ్డ తన ఉద్యమ బిడ్డకు అశ్రునయనాల మధ్య కడసారి వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.