కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని రాజన్నకు మొక్కులు
సిరిసిల్ల నుంచి వేములవాడ వరకు కంచర్ల రవిగౌడ్ పాదయాత్ర
భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
కాకతీయ, వేములవాడ: తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ చేపట్టిన సంకల్ప పాదయాత్రకు వేములవాడ పట్టణ బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. సిరిసిల్ల నుంచి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ప్రస్తుత పాలనలో మళ్లీ కరువు పరిస్థితులు నెలకొన్నాయని నాయకులు విమర్శించారు. మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్తో పాటు మంత సందీప్, బోల్లం దేవరాజు, మామిండ్ల కనకయ్య, నిమ్మశెట్టి రాజు, మిర్యాల సంతోష్, ఆంజత్ పాషా, నరాల దేవేందర్, రావికంటి సాయి తదితరులు పాల్గొన్నారు. మద్దతు తెలిపిన నేతలకు రవిగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

