ఏక్తా దివస్ రన్లో ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ఉత్సాహం
5కే, 10కే పరుగుల్లో వందమంది వాలంటీర్ల భాగస్వామ్యం
కాకతీయ, హనుమకొండ: జాతీయ ఐక్యతా భావాన్ని చాటుతూ ఏక్తా దివస్ 5కే, 10కే రన్లో వరంగల్ వెస్ట్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ పరుగులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత నిర్ణీత సమయంలో గమ్యస్థానానికి చేరుకున్న విద్యార్థులను అభినందించారు. కళాశాలకు చెందిన 100 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో పాటు ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రమ వేముల, ఎం. అర్చన పాల్గొన్నారు. విద్యార్థుల భాగస్వామ్యంపై కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోలి శ్రీలత హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు.

