epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తెలంగాణ‌ను అగ్ర‌గామిగా నిలుపుతాం..

  • ఐటీ, ఫార్మా హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం..
  • విద్యార్థుల ప‌రిశోధ‌న‌లు స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డాలి
  • మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు
  • నాంపల్లిలో ఘ‌నంగా కేయూ ఫార్మా అల్యూమిని గోల్డెన్ జూబ్లీ సెల‌బ్రేష‌న్స్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఐటీ, ఫార్మా హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతామ‌ని మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు అన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఓఆర్ఆర్‌ నిర్మించాం… శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మించాం.. ఈ రెండూ హైద‌రాబాద్‌కు అనేక పరిశ్రమలు వచ్చేందుకు కీలక భూమిక పోషించాయ‌ని అన్నారు. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నామ‌న్ని అన్నారు. ఓఆర్ఆర్ నుంచి ట్రిబుల్ ఆర్‌కు ఏర్పాటుచేస్తున్న రేడియల్ రోడ్లు పారిశ్రామిక వృద్ధికి దోహద పడుతాయ‌న్నారు. తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు మంత్రివ‌ర్గం అంతా కలిసి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామ‌ని వివ‌రించారు.

మీ సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అల్యూమిని (1974-2025) గోల్డెన్ జూబ్లీ వేడుకల‌కు ముఖ్య అతిథులుగా మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజ‌రై మాట్లాడారు. కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అల్యూమ్ని గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హాజరుకావడం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. ఫార్మసీ వృత్తి .. సమాజం పట్ల హ్యుమానిటీకి, పరిశోధన, చికిత్స, నూతన ఆవిష్కరణలకు మధ్య వారధిగా పని చేస్తుంద‌న్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రత, వారి దీర్ఘాయుష్షు కోసం మీరు అందించే సేవలు వెలకట్టలేనివ‌ని, సమాజం కోసం మీ మేధస్సును దారపోస్తార‌న్నారు. ఫార్మా రంగం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్ర‌జా ప్ర‌భుత్వం అనేక చర్యలు చేపడుతుంద‌ని అన్నారు.

భ‌విష్య‌త్ ఆవిష్క‌ర‌ణ‌ల‌కు వార‌ధి..

నల్గొండ జిల్లా సంకిశాల ప్రాంతానికి చెందిన పైళ్ల మల్లారెడ్డి 35 ఏళ్లుగా ఫార్మా రంగంలో ఉన్నారు. ఆయన న్యూ యార్క్ లో బ్యాక్టోలాక్ ఫార్మాస్యూటికల్, పలు కంపెనీలకు చైర్మన్ గా కొన‌సాగుతున్నారు. ఆయన మార్కెట్ నెట్ వర్త్ సుమారు 10 వేల కోట్లు.. గ్రామీణ ప్రాంతానికి చెందిన పైళ్ల మల్లారెడ్డి లాంటి వారిని నేటి ఫార్మా విద్యార్థులు స్పూర్తిగా తీసుకోవాలి. విద్య అనేది మనలో వెలుగు నింపుతుంది, తరతరాలకు ప్రేరణ ఇస్తుంది. ఇట్లాంటి సంస్థలు తెలంగాణ నే కాదు యావత్ భారతదేశాన్ని అభివృద్ధిలో, నూతన ఆవిష్కరణలో,సమాజ సేవ మార్గంలో నంబర్ వన్ గా నిలిపే మూల స్తంభాలుగా ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అన్నారు. గత అయిదు దశాబ్దాలుగా యూసిపిఎస్సి ఔషధ విద్య, పరిశోధన సామాజిక సేవల్లో అగ్రగామిగా నిలిచింద‌న్నారు. విద్యార్థుల్లో మేధస్సుతో పాటు నైతిక విలువలను పెంపొందించడం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అకాడమిక్, ఇండస్ట్రీ, నియంత్రణ సంస్థలలో నాయకులుగా ఎదిగేలా చేసింద‌న్నారు. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ గత విజయాల జ్ఞాపకాన్ని మాత్రమే కాకుండా, భవిష్యత్ ఆవిష్కరణలకు, సహకారానికి ప్రేరణగా నిలవాలని మంత్రులు ఆకాంక్షించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

ఇదేం అన్యాయం..!?

ఇదేం అన్యాయం..!? కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా సుధారాణి నియామ‌కంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పార్టీ అధికారంలోకి వ‌చ్చాక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.