epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రవీందర్ నాయక్
మేడారం జాత‌ర‌లో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్ల‌పై స‌మీక్ష‌

కాకతీయ, ములుగు ప్రతినిధి : రాబోయే శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతర–2026లో భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముందస్తు చర్యలు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ మరియు ఉచిత వైద్య శిబిరాల ముందస్తు ప్రణాళికలపై జరిగిన సమీక్షా సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డా.రవీందర్ నాయక్ కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి వైద్య ఇబ్బందులు రాకుండా పటిష్టమైన వైద్య వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపారు. జాతర కాలంలో పనిచేసే వైద్య సిబ్బంది ఒత్తిడికి గురికాకుండా, సేవలను సమర్థవంతంగా నిర్వహించేందుకు డ్యూటీని ఓన్ చేసుకుని పనిచేయాలని సూచించారు. డిసెంబర్ 25–31రోజుకు 3 ఉచిత వైద్య శిబిరాలు,జనవరి 1–18 రోజుకు 10 శిబిరాలు,జనవరి 19–27 రోజుకు 20 శిబిరాలు,జనవరి 28–31 రోజుకు 72 శిబిరాలు,ఫిబ్రవరి 1–10 జాతర అనంతర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. 340 రకాల మందులు, శస్త్రచికిత్స పరికరాలు భద్రపరచడం,19, 108 అంబులెన్సులు, 40 బైక్ అంబులెన్సులు వినియోగించనున్నారు. నిపుణ డాక్టర్లను ఎంజీఎం వరంగల్, భూపాలపల్లి, ములుగు ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి డిప్యూట్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే భక్తుల రద్దీ, వ్యాధి పర్యవేక్షణ, ఔషధ నిల్వలు, ఇంటర్-డిపార్ట్మెంటల్ సమన్వయం వంటి అంశాల్లో సంబంధిత శాఖలు సంయుక్తంగా పని చేయాలని సూచించారు. డిప్యూట్ చేయబోయే సిబ్బందికి ముందస్తుగా జూమ్ మీటింగ్‌లు నిర్వహించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డాక్టర్ గోపాల్ రావు, డాక్టర్ అప్పయ్య, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ రవి రాథోడ్, డాక్టర్ ప్రసాద్, జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖాధికారులు డాక్టర్ విపిన్ కుమార్, డాక్టర్ క్రాంతి కుమార్, జిల్లా ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్, అలాగే దుర్గారావు, ప్రసాద్, వెంకటపతి రాజు, మానిటరింగ్ సూపర్వైజర్లు వెంకట్ రెడ్డి, సురేష్ బాబు, భూపాల్ రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు, ఆర్బిఎస్కే డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.