epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మేడారం ఏర్పాట్లపై మంత్రుల హై లెవల్ సమీక్ష

మేడారం ఏర్పాట్లపై మంత్రుల హై లెవల్ సమీక్ష
రేపు మేడారానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఐదుగురు మంత్రులతో కూడిన ప్రత్యేక బృందం పర్యటన
అధికార యంత్రాంగంలో హడావుడి

కాకతీయ, ములుగు ప్రతినిధి : సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలో మంత్రుల బృందం ఈ నెల ఆదివారం మేడారంలో పర్యటించనుంది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మహాజాతరను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ హై లెవల్ సమీక్ష చేపడుతోంది. ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఎండౌమెంట్, పర్యావరణం, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ, పరిశ్రమలు & వాణిజ్యం, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. పర్యటన వివరాల ప్రకారం ఉదయం 11.45 గంటలకు హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న మంత్రుల బృందం మధ్యాహ్నం 12.45 గంటలకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని హెలిప్యాడ్‌కు చేరుకుంటుంది. అక్కడ కొద్దిసేపు విరామం అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు గోదావరిఖని నుంచి బయలుదేరి, 1.50 గంటలకు ములుగు జిల్లా మేడారంలో దిగనున్నారు.

జాతర ఏర్పాట్లపై సమగ్ర పరిశీలన

మేడారం చేరుకున్న అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించనుంది. భక్తులకు కల్పిస్తున్న వసతులు, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, భద్రత, వైద్య సదుపాయాలు, రవాణా వ్యవస్థ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి, ఇప్పటివరకు చేసిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనులపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అవసరమైన చోట తక్షణ ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం. మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దివాకర, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, డీఎఫ్‌వోలు, ఇతర శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వసతి, రవాణా, భద్రత, ఎస్కార్ట్, ప్రోటోకాల్ తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాయంత్రం 4.30 గంటలకు మేడారం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న మంత్రుల బృందం సాయంత్రం 5.20 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఈ పర్యటనతో మేడారం మహాజాతర ఏర్పాట్లకు మరింత వేగం వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.