epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అమ్మవారు అడిగిందా… అలిగిందా?

అమ్మవారు అడిగిందా… అలిగిందా?
సారలమ్మ గద్దెకు చేరకముందే గేట్లు ఎందుకు తెరచారు?
భద్రతా కారణాలా… సంప్రదాయానికి భంగమా?

కాక‌తీయ‌, మేడారం బృందం : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న పరిణామాలు భక్తుల్లో ఉత్కంఠను, తీవ్ర చర్చను రేపాయి. కన్నెపల్లి నుంచి సారలమ్మ తల్లి గద్దెకు చేరుకునే కీలక ఘట్టంలో దర్శనాన్ని కొద్దిసేపు నిలిపివేయడం, ఆ తర్వాత మళ్లీ భక్తులను లోపలికి అనుమతించడం వెనుక కారణాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సారలమ్మ గద్దెకు చేరుకునే వేళ మేడారం పరిసరాల్లో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. జంపన్నవాగు నుంచి గద్దెల ప్రాంగణం వరకు లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది. ఈ నేపథ్యంలో తోపులాట, తొక్కిసలాట ప్రమాదం తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా అధికారులు కొంతసేపు దర్శనాన్ని నిలిపివేశారు. అయితే గద్దెల ప్రాంగణం వెలుపల వేచి ఉన్న భక్తుల సంఖ్య మరింత పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సాంప్రదాయం ప్రకారం అమ్మవారు గద్దె ఎక్కిన తర్వాతే సాధారణ భక్తులకు దర్శనం ప్రారంభం కావాలి. కానీ ఈసారి సారలమ్మ గద్దెకు పూర్తిగా చేరకముందే గేట్లు తెరచి భక్తులను లోపలికి అనుమతించడం పట్ల గిరిజన పూజారులు, భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. “అమ్మవారు అడిగిందా… అలిగిందా?” అంటూ భక్తులు ఆధ్యాత్మికంగా ఆలోచనలో పడ్డారు. కొందరు ఇది సంప్రదాయానికి భంగమని భావిస్తే, మరికొందరు భక్తుల భద్రత కోసమే తీసుకున్న నిర్ణయమని సమర్థిస్తున్నారు.

భ‌ద్ర‌తా చ‌ర్య‌లేనంటూ అధికారుల వివ‌ర‌ణ‌..!

ఈ వ్యవహారంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందిస్తూ… ఇది పూర్తిగా భద్రతా చర్యేనని స్పష్టం చేశారు. గేట్లు తెరవకపోతే బయట తీవ్ర తోపులాట జరిగే ప్రమాదం ఉండేదని, ప్రాణనష్టం జరగకుండా చూడటానికే తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సంప్రదాయాలకు భంగం కలగకుండా పూజా కార్యక్రమాలు కొనసాగాయని అధికారులు వివరణ ఇచ్చారు. మొత్తానికి, మేడారం జాతరలో చోటుచేసుకున్న ఈ ఘటన భక్తి–భద్రత మధ్య సమతుల్యతపై మరోసారి చర్చకు తెరలేపింది. అమ్మవారి కటాక్షమే తుది నిర్ణయమని నమ్మే భక్తులు… అన్ని అనుకూలంగా సాగాలని ఆకాంక్షిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి రజక సంఘం ఏటూరునాగారం మండ‌ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.