epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డొక్కు స్కూటర్‌ నుంచి కోట్ల భవంతుల ఎలా..?

డొక్కు స్కూటర్‌ నుంచి కోట్ల భవంతుల ఎలా..?
సునీల్ రావు అవినీతి చరిత్ర బయటపెడతాం
స్మార్ట్ సిటీ పేరిట వందల కోట్ల దోపిడీ
కాంగ్రెస్ క‌రీంన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు
42వ డివిజన్‌లో డాక్టర్ రాజన్న నామినేషన్‌కు భారీ ర్యాలీ

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర రాజకీయాల్లో ఎన్నికల వేళ మరోసారి తీవ్ర వేడి పుట్టింది. మాజీ మేయర్ సునీల్ రావుపై కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు సంచలన ఆరోపణలు గుప్పించారు. ఒకప్పుడు డొక్కు స్కూటర్‌పై తిరిగిన సునీల్ రావు స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల పేరిట వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి తెలంగాణలో ఏ నేతకూ లేని విధంగా అత్యాధునిక భవంతులు నిర్మించుకున్నాడని మండిపడ్డారు. సునీల్ రావు మేయర్‌గా ఉన్న కాలంలో అభివృద్ధి పనుల ముసుగులో కరీంనగర్ ప్రజలను దోచుకున్నారని రాజేందర్ రావు ఆరోపించారు. బిల్డింగ్‌లు, అపార్ట్‌మెంట్లు, దుకాణాల నిర్మాణాల్లో దౌర్జన్యంగా వసూళ్లు జరిగాయని కోట్ల రూపాయలు స్వాహా చేశారన్న విమర్శలు గుప్పించారు. ఈ అవినీతి బాగోతం నగర ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.

42వ డివిజన్‌లో భారీ ర్యాలీ

శుక్రవారం కరీంనగర్ నగరంలోని 42వ డివిజన్ భగత్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రాజన్న నామినేషన్ దాఖలు సందర్భంగా వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ నిజాయితీగా ప్రభుత్వాధికారిగా సేవలందించిన డాక్టర్ రాజన్నకు ప్రజలు ఆశీర్వాదం ఇస్తే డివిజన్‌కు స్వచ్ఛమైన, బాధ్యతాయుత పాలన వస్తుందని అన్నారు. అవినీతిపై ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య పోరు కాదని నిజాయితీ వర్సెస్ అవినీతి మధ్య జరుగుతున్న సమరమని వ్యాఖ్యానించారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు, దూషణలకు దిగడం రాజకీయ విలువలకు విరుద్ధమని రాజేందర్ రావు తీవ్రంగా విమర్శించారు. కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని చేసే విమర్శలు తగవని ప్రజల ముందు నిజాలు త్వరలోనే బయటపడతాయని స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి అవినీతిని ప్రజలు తిరస్కరించి నైతిక రాజకీయాలకు మద్దతు ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.