epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పాసులు పక్కదారి

పాసులు పక్కదారి
అర్హత లేనివారికే వీఐపీ, వీవీఐపీ దర్శనం!
మేడారం జాతరలో ఇష్టారాజ్యంగా పాసుల జారీపై భక్తుల ఆగ్రహం.

కాకతీయ, ములుగు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న సమ్మక్క–సారలమ్మల మహా జాతర 2026లో విఐపి, వివిఐపి దర్శన పాసులు పక్కదారి పట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న జాతర నేపథ్యంలో దర్శన వ్యవస్థలో పారదర్శకత ఉంటుందని అధికారులు చెబుతుండగా, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, ప్రముఖులకు త్వరిత దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన విఐపి, వివిఐపి పాసులు అర్హత లేని వారి చేతుల్లోకి వెళ్లాయని భక్తులు ఆరోపిస్తున్నారు. జాతర ప్రాంతంలో వాటర్ సప్లై చేసే ట్రాలీ ఆటోకు కూడా విఐపి పాస్ ఉండటం బయటపడటంతో ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జాతరకు ముందు విఐపి, వివిఐపి పాసుల సంఖ్యకు కోత విధించామని ప్రకటించిన అధికారులు, వాస్తవంగా మాత్రం ఇష్టారాజ్యంగా పాసులు జారీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల సన్నిహితులు, బంధువులు, పరిచయస్తులకు పాసులు కేటాయించారని, అక్కడక్కడా ఒక్కో పాస్‌ను రూ.2000 నుంచి రూ.5000 వరకు అమ్ముకున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది.

దర్శన పాసులపై స్వయంగా మంత్రి ధనసరి అనసూయ సీతక్క మీడియాతో మాట్లాడుతూ, విఐపి, వివిఐపి పాసులను పుట్నాల్లాగా పంచలేం అని, సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా పాసుల సంఖ్యను తగ్గించాం అని స్పష్టం చేశారు. అయితే మంత్రి చెప్పిన మాటలకు భిన్నంగా పాసుల దుర్వినియోగం జరుగుతుండటంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఇబ్బందులు పడుతుంటే, అర్హత లేని వారు విఐపి పాసులతో సులువుగా దర్శనం చేసుకుంటున్నారన్న ఆరోపణలు జాతర నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇప్పటికైనా విఐపి, వివిఐపి పాసుల జారీపై సమగ్ర విచారణ చేపట్టి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేనిపక్షంలో మేడారం మహా జాతరపై ప్రజల్లో నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంతా ఈశ్వర మాయ!

అంతా ఈశ్వర మాయ! లాగిన్‌ నుంచి రహదారి తనిఖీల దాకా అక్రమాలు విధుల్లో లేని...

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు!

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు! నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డగోలు వ్యవహారం? 2 మండలాల్లో పంచాయతీ...

సీట్ల‌కు అంటుకుపోయారు!

సీట్ల‌కు అంటుకుపోయారు! రెవెన్యూ విభాగంలో పాతుకుపోయిన ఆర్ఐలు బదిలీ నిబంధనలు నీటి మూటలేనా? 6 ఏళ్లుగా...

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’ ఇష్టారాజ్యంగా ములుగు డీటీవో ఈశ్వ‌ర్...

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి పరకాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు మౌలిక వసతుల...

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది రుణమాఫీ, రైతుభరోసా,...

దొరల పాలన కాదు.. ప్రజా పాలన

దొరల పాలన కాదు.. ప్రజా పాలన దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు తాతా...

క‌డియం సిగ్గుప‌డు..!

క‌డియం సిగ్గుప‌డు..! కేసీఆర్‌ దళితులకు ఏం చేయలేదా.?! ఎన్టీఆర్‌ తర్వాత నీకు రాజకీయ బిక్ష...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.