అర్హులందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యం
: వెలిచాల రాజేందర్రావు
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి కసరత్తు
చింతకుంట, ఆరెపల్లి, బద్దిపల్లిలో పనుల పరిశీలన
కాకతీయ, కరీంనగర్ : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రెండు పడకల (డబుల్ బెడ్రూమ్) ఇల్లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని చింతకుంట, ఆరెపల్లి ప్రాంతాలతో పాటు కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో నిర్మిస్తున్న గృహాలను మంగళవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న గృహాల పురోగతిని, మిగిలిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్ల నిర్మాణంలో పెండింగ్‌లో ఉన్న పనుల అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పూర్తి అయ్యేలా చూస్తానన్నారు. చింతకుంటలో నిర్మించిన ఇళ్లను త్వరలోనే ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తుందని తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కార్పొరేటర్లు గంట కళ్యాణి శ్రీనివాస్, గుమ్మడి రాజ్‌కుమార్, ఆకుల నందిని ఉదయ్, కాంగ్రెస్ నాయకులు అర్ష మల్లేశం, ఖదీర్ షా ఖాన్ పాల్గొన్నారు.

