epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?
కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం
కేటీఆర్‌ నేతృత్వంలో తుక్కుగూడకు ఎమ్మెల్యేలు
అన్నదమ్ములకు వందల కోట్ల భూములా?
ప్రజలకు సంక్షేమం చేయడానికి పైసల్లేవా?
ఫ్యూచర్‌ సిటీ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ మాయాజాలం
ప్రభుత్వ భూముల కేటాయింపుపై కేటీఆర్‌ ప్రశ్నల వర్షం
కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు అనుముల కొండల్‌రెడ్డికి టెస్సెరాక్ట్‌ కంపెనీ కోసం సుమారు రూ.250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ.7 కోట్లకే కేటాయించారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూమిని మార్కెట్‌ విలువకు కాకుండా ఇంత తక్కువ ధరకు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూములు, రాయితీలు, మినహాయింపులు కల్పించడం అధికార దుర్వినియోగం కాదా, ప్రయోజనాల సంఘర్షణ కాదా, కుటుంబ పాలన కాదా అని నిలదీశారు. ఈ భూకేటాయింపును నిరసిస్తూ గురువారం కేటీఆర్‌ నేతృత్వంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు తుక్కుగూడకు చేరుకుని భూమిని పరిశీలించారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.
రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకే ఎలా?
ఈసంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..! ముఖ్యమంత్రి సోదరుడు అనుముల కొండల్‌రెడ్డికి కేటాయించిన భూమి విలువ సుమారు రూ.250 కోట్లు ఉంటే కేవలం రూ.7 కోట్లకే ఎలా ఇచ్చారని కేటీఆర్‌ ప్రశ్నించారు. భూకేటాయింపునకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూములను మార్కెట్‌ విలువకు కాకుండా తక్కువ ధరకు కేటాయించడంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. మరోవైపు అనుముల జగదీశ్వర్‌రెడ్డికి సంబంధించిన సంస్థకు రూ.1,000 కోట్ల పెట్టుబడి పేరుతో ప్రభుత్వ రాయితీలు, భూములు, మినహాయింపులు కల్పించే వ్యవహారంపైనా కేటీఆర్‌ ప్రశ్నలు సంధించారు. ఒకవైపు ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి.. మరోవైపు పారిశ్రామికవేత్త అనుముల జగదీశ్వర్‌రెడ్డి.. ఇద్దరి మధ్య రూ.1,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం.. దానికి మళ్లీ ప్రభుత్వ రాయితీలు, భూములు, మినహాయింపులు ఇవ్వాలా అని నిలదీశారు.
అన్నదమ్ములకు వందల కోట్ల ప్రయోజనాలా?
ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూములు, రాయితీలు, మినహాయింపులు, పెట్టుబడి ప్రయోజనాలు కల్పించడం అధికార దుర్వినియోగం కాదా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఇది కుటుంబ పాలన కాదా, ప్రయోజనాల సంఘర్షణ కాదా అని నిలదీశారు. ముఖ్యమంత్రి సోదరుడి సంస్థ ఇజ్రాయెల్‌ ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌తో చేసుకున్న ఒప్పందంపైనా ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. రూ.250 కోట్ల విలువైన భూమిని రూ.7 కోట్లకే కేటాయించిన వ్యవహారంపై బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈడీ, ఐటీ, సీబీఐలు ప్రతిపక్షాలపై కేసులు పెట్టడానికే ఉన్నాయా? అధికారంలో ఉన్నవారి వ్యవహారాలు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. తెలంగాణ కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిందని ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఆరోపిస్తున్నారని కేటీఆర్‌ గుర్తుచేశారు. తెలంగాణను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నప్పుడు దొంగలను పట్టుకోవాల్సిన కేంద్ర హోంమంత్రి ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఇంత పెద్ద భూకేటాయింపు వ్యవహారం జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాలు కేంద్ర ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలకు లోబడి ఉంటాయని కేటీఆర్‌ అన్నారు. ఈ రంగాల్లోనూ అధికారానికి దగ్గరగా ఉన్న కుటుంబాలకు ప్రయోజనాలు కల్పిస్తున్నారన్న అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థలతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థలు ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగంలోకి రావడంపై పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు.
సభలో గొంతు నొక్కారు.. అందుకే ఇక్కడికి వచ్చాం
శాసనసభలో భూకేటాయింపులు, ఫ్యూచర్‌ సిటీ, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తామనే తమను సస్పెండ్‌ చేసి బయటకు పంపారని కేటీఆర్‌ అన్నారు. సభలో తమ గొంతు నొక్కారని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తామనే భయంతోనే బయటకు పంపారని విమర్శించారు. అందుకే ముఖ్యమంత్రి సోదరుడికి కేటాయించిన భూమి వద్దకు వచ్చి ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. ఫ్యూచర్‌ సిటీ పేరుతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ మాయాజాలం నడుపుతున్నదని కేటీఆర్‌ ఆరోపించారు. గతంలో ఫార్మాసిటీ కోసం నిర్దిష్ట షరతులతో భూసేకరణ జరిగిందని, ఆ భూములను ఇప్పుడు ఇతర కార్యకలాపాలకు వినియోగించడం చట్టపరంగా ప్రశ్నార్థకమని అన్నారు. ఫ్యూచర్‌ సిటీ పేరుతో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు ఈ న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
పెట్టుబడిదారులు బలిపశువులు కావొద్దు
ఫ్యూచర్‌ సిటీ భవిష్యత్తుపై న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని కేటీఆర్‌ అన్నారు. భవిష్యత్తులో కోర్టుల్లో ఈ భూములపై వివాదాలు తలెత్తితే నష్టపోయేది పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలేనని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి కుటుంబ ప్రయోజనాల కోసం జరుగుతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారంలో పెట్టుబడిదారులు బలిపశువులు కావద్దని సూచించారు. ప్రభుత్వం నిజంగా పారదర్శకంగా వ్యవహరిస్తే సామాన్యులు, యువత, రైతులకు కూడా ఇదే తరహాలో ప్రభుత్వ భూములు, రాయితీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాము రూ.1 లక్ష మూలధనంతో పెట్టుబడి పెడతామని వస్తే రూ.200 కోట్ల విలువైన స్థలం ఇస్తారా? తమకూ అదే రాయితీలు, మినహాయింపులు ఇస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రతి గ్రామంలో సదస్సులు
ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టబోమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. అవసరమైతే ప్రజా కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహించి భూకేటాయింపులు, ఫ్యూచర్‌ సిటీ పేరుతో జరుగుతున్న వ్యవహారాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. అవసరమైన అన్ని న్యాయ, ప్రజాస్వామ్య మార్గాలను అన్వేషించి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఫ్యూచర్‌ సిటీ పేరుతో ప్రభుత్వం చూపిస్తున్న రంగుల కల వెనుక ఉన్న న్యాయపరమైన అంశాలను కూడా మీడియా ప్రజలకు వివరించాలని కేటీఆర్‌ కోరారు. భవిష్యత్తులో పెట్టుబడిదారులు నష్టపోయే అవకాశం ఉన్న అంశాలను వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సొమ్ము, ప్రభుత్వ భూముల విషయంలో జవాబుదారీతనం, పారదర్శకత ఉండాల్సిందేనని పేర్కొంటూ.. ఈ భూవ్యవహారంపై బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.