బాధిత కుటుంబాలకు చల్లా పరామర్శ
కాకతీయ, గీసుగొండ: అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని, రోడ్డు ప్రమాదంలో గాయపడిన పార్టీ కార్యకర్తను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బుధవారం పరామర్శించారు. మండలంలోని కొనాయిమాకుల గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గుండెకారి గట్టయ్య నివాసానికి వెళ్లిన ఆయన, మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. గట్టయ్య మృతికి గల కారణాలను ఈ సందర్భంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే, రాంపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు తాబేటి సదానందం ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, చల్లా ధర్మారెడ్డి ఆయనను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రస్తుతం అందుతున్న వైద్యం మరియు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సదానందం త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమాల్లో మాజీ జెడ్పిటిసి పోలీసు ధర్మారావు, అంకతి నాగేశ్వరరావు, గుర్రం రఘు, బోడకుంట్ల ప్రకాష్, యూత్ నాయకులు సిరిషే శ్రీకాంత్, లడే సంతోష్, కాందారి గోపాల్, మార్గం రాజు, ఎండి జహీర్, పోలీస్ రాజీవ్ గాంధీ, ఎండి అజార్ తదితరులు పాల్గొన్నారు.

