epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సింగ‌రేణిని విస్త‌రిస్తాం

సింగ‌రేణిని విస్త‌రిస్తాం
గ్రీన్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్ రంగాల్లోకి అడుగుపెట్టాలి
ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యం
కొత్త బొగ్గు బ్లాకుల అభివృద్ధికి ప్రభుత్వ సంపూర్ణ సహకారం
పోటీ ప్రపంచంలో సంస్థ‌ను మరింత బలోపేతం చేయాలి
బొగ్గు నాణ్యత, ఉత్పాదకతపై ప్రత్యేక దృష్టి
డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌
కొత్తగూడెంలో సింగ‌రేణి కార్యాల‌యంలో ఉన్న‌త స్థాయి సమీక్ష

కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సింగరేణి సంస్థను అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సంస్థను కాపాడుకోవడం, లాభాల బాటలో నడిపించడం, పోటీ ప్రపంచంలో మరింత బలోపేతం చేయడం అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, యాజమాన్యం అందరి ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. కొత్త బొగ్గు బ్లాకుల అభివృద్ధికి అవసరమైన ప్రతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్), తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (జెన్‌కో) ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు.

పోటీని తట్టుకునేలా ప్రణాళికలు

తెలంగాణకు సింగరేణి ఆత్మవంటిదని, 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ సంస్థను కాలానుగుణంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భట్టి పేర్కొన్నారు. ఒకప్పుడు బొగ్గు ఉత్పత్తిలో సింగరేణిదే ఏకఛత్రాధిపత్యమని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను బహిరంగ వేలానికి తెచ్చిన తర్వాత ప్రైవేటు సంస్థల నుంచి తీవ్ర పోటీ నెలకొందన్నారు. ఈ పరిస్థితుల్లో నాణ్యత, ఉత్పాదకత, ఆధునిక సాంకేతికత, వ్యయ నియంత్రణపై దృష్టి పెడితేనే సంస్థ భవిష్యత్తు మరింత బలపడుతుందని చెప్పారు. ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో అగ్రస్థానంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ పెరుగుతున్న పోటీని ఎదుర్కోలేక వెనుకబడిన విషయాన్ని గుర్తుచేస్తూ, అలాంటి పరిస్థితి సింగరేణికి రాకుండా ముందస్తు ప్రణాళికలతో పనిచేయాలని సూచించారు.

నాణ్యమైన బొగ్గే సంస్థకు బలం

జెన్‌కోతో పాటు ఇతర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సరఫరా చేసే బొగ్గు అత్యున్నత నాణ్యతతో ఉండాలని భట్టి స్పష్టం చేశారు. తవ్వకాల సమయంలో మట్టి, రాళ్లు, ఇతర మలినాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట బొగ్గు వాషింగ్ చేసి యాష్‌ కంటెంట్ తగ్గించాలని అధికారులకు సూచించారు. గ్రేడ్–4, గ్రేడ్–5, గ్రేడ్–6 ప్రమాణాల ప్రకారం శాస్త్రీయంగా బొగ్గును బ్లెండింగ్ చేసి సరఫరా చేయడం ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని మరింత పెంచవచ్చన్నారు. సింగరేణి లాభాల్లో ఉంటేనే వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని పేర్కొంటూ, సంస్థ అభివృద్ధిని ప్రతి ఉద్యోగి తన కుటుంబ బాధ్యతగా భావించి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గని స్థాయిలో అధికారులు, కార్మికులు సమావేశాలు నిర్వహించి ఉత్పాదకత పెంపుపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

కొత్త బ్లాకులు.. గ్రీన్ ఎనర్జీపై దృష్టి

గత పదేళ్లలో కొత్త బొగ్గు బ్లాకుల అభివృద్ధిలో ఆశించిన పురోగతి సాధించలేకపోయామని పేర్కొన్న భట్టి, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త బొగ్గు బ్లాకులను వేగంగా అభివృద్ధి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒడిశాలోని నైనీ బ్లాక్‌, తాడిచర్ల–2 ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యలను వేగంగా పరిష్కరించినట్లు తెలిపారు. రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో ఇంధన రంగంలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నందున సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా థర్మల్ పవర్‌, సోలార్‌, పంప్డ్‌ స్టోరేజ్‌, గ్రీన్ హైడ్రోజన్‌, బ్యాటరీ స్టోరేజ్‌, గ్రీన్ ఎనర్జీ రంగాల్లోనూ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే లిథియం, కోబాల్ట్‌, రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ వంటి క్రిటికల్‌ ఖనిజాల అన్వేషణ, మైనింగ్‌లోనూ ప్రవేశించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఖనిజాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో క్రిటికల్‌ మినరల్స్‌ బ్లాకుల వేలంలో పాల్గొనే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. సింగరేణిలో ఉన్న మైనింగ్ నిపుణుల అనుభవాన్ని అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో వినియోగించి సంస్థకు కొత్త ఆదాయ వనరులు సృష్టించాలని పేర్కొన్నారు. ఇకపై సింగరేణి బోర్డు సమావేశాలు కేవలం పరిపాలనా అంశాలకే పరిమితం కాకుండా సంస్థ విస్తరణ, పెట్టుబడులు, సాంకేతిక ఆధునికీకరణ, భవిష్యత్‌ అభివృద్ధి వ్యూహాలపై చర్చించే వేదికగా మారాలని సూచించారు. కార్పొరేట్‌ సంస్థల తరహాలో స్పష్టమైన లక్ష్యాలు, కాలపట్టికతో పనులు పూర్తి చేయాలని, పెండింగ్‌ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు, జనరల్‌ మేనేజర్లు, జెన్‌కో ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.