epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రియ‌ల్ ఎస్టేట్ ప‌డిపోతే ఎక‌రా 170 కోట్ల‌కు కొంట‌రా ?

  • రాజ‌ధానిలో రియల్ ఎస్టేట్ వేగంగా దూసుకెళ్తుంది
  • దేశంలోనే అభివృద్ధిలో దూసుకుపోతోంది..
  • హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
  • డీజిల్ బ‌స్సుల స్థానంలో అన్ని ఎలక్ట్రికల్ బస్సులే..
  • న‌గ‌రానికి బ‌డ్జెట్లో ఏడాదికి రూ. 10 వేల కోట్లు..
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క .. మంత్రి జూప‌ల్లి..

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ మహానగరం సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాష్ట్రంలో రియ‌ల్ ఎస్టేట్ ప‌డిపోయింద‌ని కొంద‌రు దుష్ప్ర‌చారం చేస్తున్నారు.. అదే నిజ‌మైతే హైద‌రాబాద్‌లో ఎక‌రం భూమి ధ‌ర రూ. 170 కోట్లు ఎలా ప‌లికింద‌ని ప్ర‌శ్నించారు. శుక్రవారం హైటెక్స్‌లో జరిగిన నెరెడ్కో (నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్) 15వ సమావేశానికి డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయ‌ని, రియల్టర్లు వివిధ వర్గాలను ఆ ప్రాంతాలకు విరివిగా తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం కోరారు.

క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తాం..

హైదరాబాద్‌ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చే క్రమంలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకువస్తున్నామ‌ని, భవిష్యత్తులో నగరంలో అన్ని ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయ‌ని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపులు ఇచ్చామ‌ని బ‌ట్టి అన్నారు. ప్రతి సంవత్సరం న‌గ‌ర అభివృద్ధికి ప్రణాళిక వ్యయం లో భాగంగా బడ్జెట్లో రూ. 10వేల కోట్లు కేటాయిస్తున్నామ‌ని చెప్పారు. రెండు సంవత్సరాల్లో 20 వేల కోట్లు కేటాయించి చేపట్టిన పనుల ఫలితాలు ఇప్పుడే కనిపిస్తున్నాయ‌న్నారు. ఈ పనుల‌తో హైదరాబాద్ రూపురేఖలను మార‌నున్నాయ‌ని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఢిల్లీలో మకాం వేసి కేంద్ర డిఫెన్స్ మంత్రిని ఒప్పించి రక్షణశాఖ భూములను వినియోగించుకునేందుకు అనుమతి సాధించారని డిప్యూటీ సీఎం తెలిపారు. షామీర్‌పేటలో 3,619 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నామని వివరించారు. దేశంలోని ఇతర ఏ నగరాల్లో లేని విధంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌, తాగునీటి సరఫరా హైదరాబాద్ నగరంలోనే జరుగుతుంద‌ని అన్నారు.

వారిని దృష్టిలో పెట్టుకోవాలి

విద్య, వైద్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలు అన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉచితంగా విద్యను అందించేందుకు ఒక్కో పాఠశాల 25 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నాం, ఇందుకుగాను 11,500 కోట్ల బడ్జెట్ కేటాయించి పాఠశాలల నిర్మాణానికి టెండర్లు పిలిచాం అన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. నేరెడ్కో ప్రతినిధులు CSR నిధులను విద్య, వైద్యరంగంపై పెద్ద మొత్తంలో ఖర్చు చేయండి, ఖర్చు చేసిన నిధులకు సంబంధించి జిల్లా కలెక్టర్ల ద్వారా సర్టిఫికెట్లు పొందండి అని సూచించారు. విల్లాలు, హై రైజ్ బిల్డింగులకే పరిమితం కావొద్దు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేయాల‌ని డిప్యూటీ సీఎం సూచించారు.

హైద‌రాబాద్ అభివృద్ధిలో రియ‌ల్ రంగం కీల‌కం..

మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధిక వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని, హైదరాబాద్ అభివృద్ధిలో రియలేస్టేట్ రంగం కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం తీసుకొస్తున్న పురోగమక విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాయని తెలిపారు. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల విస్తరణకు రియల్ ఎస్టేట్ కీలక మౌలిక సదుపాయాలను అందిస్తోందని జూప‌ల్లి వివరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.