epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పాల ఉత్పత్తుల్లో ఆదర్శంగా నిలవాలి

  • మధిర నియోజకవర్గం మహిళా డైయిరీ నా చిరకాల వాంఛ
  • పథకం అమలుతో పదేళ్ల నా కల నెరవేరింది
  • పాల ఉత్పత్తులతో ఏటా రూ.1000 కోట్లు సంపాదించేలా చర్యలు
  • త్వరలో బోనకల్లులో ఇందిరా మహిళ డైయిరీ పరిశ్రమ
  • డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

కాకతీయ, తెలంగాణ బ్యూరో : పాల ఉత్పత్తుల ద్వారా మధిర నియోజకవర్గం మహిళా సంఘాల సభ్యులు భారత దేశానికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖ‌మ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళ డైయిరీ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా డైయి రీ తన చిరకాల వాంఛ అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 సంవత్సరంలో మధిర నియోజకవర్గంలోని 52,000 మహిళా సంఘాల సభ్యులకు రెండు గేదలు కొని వ్వాలని ఆరోజు భావించానన్నారు. అయితే అదే సమయంలో రాష్ట్ర విభజన జరగడం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పదేళ్లపాటు ఈ పథకాన్ని పట్టించుకోకపోవడంతో అమలు చేయలేకపోయామన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే మధిర నియోజకవర్గం లో మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో పాటు వారు సమాజంలో పోటీపడి బతకాలని ఈ పథకాన్ని అమలులోకి తీసుకురావడంతో తన చిరకాల వాంఛ నెరవేరింది అన్నారు.

ప్ర‌తీ మ‌హిళ‌కు రెండు గేదెలు..!

ప్ర‌జా ప్ర‌భుత్వంలో ప్రతి మహిళకు రెండు గేదెలను ఇవ్వడంతో పాటు వాటిని కాపాడడానికి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క అన్నారు. గేదెలు ఉండటం కోసం కొట్టాలు మంజూరు చేయడంతో పాటు, సోలార్ ను కూడా మంజూరు చేస్తామన్నారు. రోజువారి కూలీలకు పనులకు వెళ్లే మహిళలు తాము గేదెలు తీసుకుంటే వాటిని ఎవరు చూస్తారు గడ్డి ఎవరు వేస్తారు, దాన ఎవరు వేస్తారు అన్న భావన ఉండవచ్చని, అయితే అందుకోసం మీరు కూలి పనులకు వెళ్లినప్పటికిని గేదెలకు దానా గడ్డి సరఫరా చేయడం కోసం నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడం జరుగుతుందని, వారే వచ్చి సరఫరా చేసేలా ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం ఉపాధి కల్పిస్తున్న యువతకు ట్రాలీ ఆటోలు కూడా ఇప్పిస్తామన్నారు. ప్రతి మండలాన్ని మూడు భాగాలుగా విభజించి, ప్రతి 10 గ్రామాలను యూనిట్గా ఏర్పాటు చేసి పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు.

భూమి లేకున్నా కూడా గేదెల మంజూరు

భూమి లేకున్నా కూడా గేదెలను మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క అన్నారు. భూమి ఉన్న నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేలా వారి పొలాలలో గడ్డిని పెంచిపించి గడ్డిని కూడా సరఫరా చేస్తామన్నారు. ప్రతి నెల గేదెలను వాటి ఆరోగ్యాన్ని పరీక్షించడం కోసం డాక్టర్లు వస్తారని అంబులెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. డాక్టర్లు గేదెల ఆరోగ్యాన్ని పరీక్షించడంతోపాటు గేద ఆరోగ్యం ఎలా ఉంది అనే రిపోర్టు కూడా రూపొందిస్తారని ఎన్ని లీటర్ల పాలు ఇస్తున్నాయని గుర్తిస్తారన్నారు. అదేవిధంగా ప్రతి గేదెకు సంబంధించి హెల్త్ కార్డును అందజేస్తామన్నారు. ప్రతి లబ్ధిదారుడు పాల ఉత్పంతులు పెంచేలా చూడాలని కనీసం 10 లీటర్లకు పైగా రోజు విక్రయించుకునేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. బోనకల్లు మండలంలోని ఇందిరా మహిళా శక్తి పాల పరిశ్రమను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ పరిశ్రమను అమూల్, విజయ డైరీ, హెరిటేజ్ పరిశ్రమల మాదిరిగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఇక్కడి పాల ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అమ్మేలా ఏర్పాటు చేస్తామని అన్నారు. పాల ఉత్పత్తులను పెంచడం ద్వారా మదిర నియోజకవర్గ మహిళలు 1000 కోట్లు సంపాదించేలా చర్యలు తీసుకుంటామని ఈ విధంగా 5 ఏళ్లలో 5000 కోట్లు సంపాదించాలని ఆకాంక్షించారు. ఇందుకు రాష్ట్రంలోనే మధిర నియోజకవర్గం లో ప్రాథమిక పునాది పడిందని అన్నారు. ఈ ఏడాది 20 వేల మంది మహిళలకు గేదలను పంపిణీ చేస్తామని వచ్చే ఏడాది మరో 20 వేల మందికి, ఆ తర్వాత మిగిలిన 20వేల మందికి గేదెలను పంపిణీ చేస్తామన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.