epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఫ్ర‌స్టేష‌న్‌లో బీఆర్ఎస్ నేత‌లు

  • వారి మాట‌లు వింటుంటే జాలేస్తోంది
  • అద్దం లాంటి రోడ్లు వేస్తామంటే గుండెలు అదురుతున్నాయి
  • అన్నిట్లోస్కాం లు చేసిన మీకు ఏది చూసిన స్కామే కన్పిస్తోంది
  • మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాటలు విన్నాకా ఇంత అజ్ఞానుడా అనిపించింది
  • సీఆర్ఐఎఫ్ రోడ్లకు.. హ్యామ్ రోడ్ల విధానికి చాలా తేడా
  • కళ్ళద్దాలు పెట్టుకొని కూడా..0.4% ను 4% అని చదివావంటే నీ ఆరోగ్యం పై నాకు ఆందోళనగా ఉంది
  • ఈ విష‌యం తెలియ‌కుండానే ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా పనిచేశారు
  • ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి సెటైర్లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ప‌చ్చ‌కామెర్లోడికి లోక‌మంతా ప‌చ్చ‌గానే క‌నిపించిన చందాన‌.. పేద‌ళ్లు అనేక ప‌థ‌కాల్లో స్కాములు చేసినా బీఆర్ ఎస్ నేత‌ల‌కు ఇప్పుడు మేం ఏ అభివృద్ధి ప‌ని చేసినా అందులో స్కాంలంటూ ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సైట‌ర్లు వేశారు. శ‌నివారం ఆయ‌న హైద‌రాబాద్‌లో విలేక‌రులతో మాట్లాడారు. హ్యామ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే రోడ్లలో 8వేల కోట్ల స్కాం జరుగుతుందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశాంత్ రెడ్డి ఆరోపణలపై మంత్రి తన దైన శైలిలో సమాధానమిచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ నేతల ప్రెస్టేషన్ మాటలు వింటుంటే జాలేస్తోంద‌న్నారు. గతంలో రోడ్లు వేయాలంటే వారికి మనసు రాలేదు.. . ఇప్పుడు అద్దం లాంటి రోడ్లు వేస్తామంటే బీఆర్ఎస్ నేత‌ల గుండెలు అదురుతున్నాయని అన్నారు. కాళేశ్వరం స్కాం, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం స్కాం, ధరణి స్కాం, గొర్రెల స్కాం ఇలా చెప్పుకుంటూ పోతే పదేళ్ల కాలంలో మీరు చేసిన స్కాంలకు అంతే లేదని మండిపడ్డారు. కవిత వేరే కుంపటి పెట్టుకుంది..ఇవాళ్టి నుంచి జనాల్లోకి అంటూ వెళ్తున్నది..మరోవైపు హరీష్ రావు కొత్త పార్టీ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంద‌ని మంత్రి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుండడం..ఆ పార్టీ నేతలు చెట్టుకొకరు, పుట్టకొక్కరు అవడం చూసి చోటా..మోటా బీఆర్ఎస్ నేతలు అయోమయంలో పడి.. ఆగం ఆగం అవుతున్నారనీ విమర్శించారు.

ప్రశాంత్ రెడ్డి ఇంత అజ్ఞానుడు అనుకోలేదు..!

“మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడే..కానీ ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇంత అజ్ఞానా..? అని విచారం వ్యక్తం చేస్తున్నాన‌ని అన్నారు. సీఆర్ఐఎఫ్‌ రోడ్లకు.. హ్యామ్ రోడ్ల విధానికి చాలా తేడా ఉంటుంది. ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనకు ఇది తెలియకపోవడం బాధాకరమన్నారు. సీఆర్ఐఎఫ్ లో కి. మీ1.75 కోట్లు అవుతుందన్నది సింపుల్ వైడెనింగ్ కోసం మాత్రమే, అదే హ్యామ్ మోడల్ లో చేస్తున్నది డబుల్ లేన్ బలోపేతం అది కూడా ఎన్ హెచ్ ఏఐ నార్మ్స్ ప్రకారం చేస్తున్నామ‌ని తెలిపారు. కి.మీ రోడ్డు మెయింటెనెన్స్ కోసం రూ.2కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నార‌ని, కి.మీ రోడ్డు కోసం రూ.6 కోట్లు అవుతుందని అసత్యాలు మాట్లాడాడని, నిజానికి 15 సంవత్సరాల్లో ఒక్క కి.మీ మెయింటెనెన్స్ కోసం ఖర్చు చేసేది కేవలం 20లక్షల లోపే..మొత్తం ఒక్క కి.మీ మీద మొత్తం కాలానికి 2కోట్ల90లక్షలు మాత్రమే అవుతుందని వివరించారు. “కళ్ళద్దాలు పెట్టుకొని కూడా..0.4% ను 4% అని చదివావంటే నీ ఆరోగ్యం పై నాకు ఆందోళన కలుగుతుంది మిత్రమా” అని మంత్రి తన స్టైల్ సెటైర్ వేశారు.

“చింత చచ్చినా..పులుపు చావలేదన్నట్లు

మెయింటెనెన్స్ కోసం మొదటి సంవత్సరం ప్రభుత్వం ఏమి ఖర్చు చేయదనీ..రెండో సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు 0.4% మాత్రమే చేస్తుందని మంత్రి తెలిపారు. 6వ సంవత్సరంలో 0.8%,7వ సంవత్సరంలో రోడ్ రెన్యువల్ కు 2.4%, తర్వాత 8 నుంచి 12 సంవత్సరాల వరకు 0.4% శాతం,13 నుండి 0.8%శాతం అని ఇలా మొత్తం 15 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ కోసం అయ్యే ఖర్చు కేవలం 20 లక్షల లోపే అని మంత్రి స్పష్టం చేశారు. “నేను 6 సార్లు ప్రజల ఆశీర్వాదంతో చట్టసభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధిని..ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో చిన్న మచ్చ(ఆరోపణ) కూడా నాపై లేదు.నేను అవినీతిని ప్రోత్సహించే వ్యక్తిని కాదు..అవినీతి జరిగితే చూస్తూ ఊరుకోను. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి,ఆమరణ దీక్షతో ప్రాణ త్యాగానికి సిద్ధ పడ్డోడిని…నా చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రజల మేలు కోసమే పనిచేస్తానని తెలిపారు. “చింత చచ్చినా..పులుపు చావలేదన్నట్లు..” తెలంగాణ ప్రజలు మీ అహంకారాన్ని ఇంకా గమనిస్తున్నారు అంటూ బిఆర్ఎస్ కు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.