epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నాణ్యత లేకుండా అభివృద్ధి పనులు…

నాణ్యత లేకుండా అభివృద్ధి పనులు…
మేడారం పనులపై తీవ్ర విమర్శలు…
ప్రభుత్వానికి బీఆర్ఎస్ హెచ్చరిక….
బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు

కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఏర్పాట్లలో జరుగుతున్న పనుల్లో నాసిరకం, అవ్యవస్థ, సంప్రదాయాల ఉల్లంఘన జరుగుతోందని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. శనివారం ఏటూర్ నాగారం కేంద్రంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై, అలాగే మంత్రి సీతక్కపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జాతర ప్రాంతంలో వాడుతున్న మెటీరియల్ పూర్తిగా నాణ్యత లేనిదని, ఫ్లోరింగ్‌కు మట్టి కలిసిన ఇసుక వాడుతున్నారని ఆరోపించారు. అక్కడ గ్యాప్‌లు, లెవెల్ మిస్‌మ్యాచ్ స్పష్టంగా కనిపిస్తాయని, భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సరైన చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూ లైన్లు లేకపోవడం, చెత్త కుప్పలు పేరుకుపోవడం, ఎంట్రన్స్ ప్రాంతం గుర్తుపట్టలేనంతగా మారిపోవడం వల్ల భక్తులు అయోమయంలో పడుతున్నారని తెలిపారు. కోట్లాది మంది వచ్చే జాతరలో కనీస వసతులు కూడా సక్రమంగా లేవని విమర్శించారు. తొందరపడి పనులు చేయడం వల్ల క్వాలిటీపై దృష్టి పెట్టడం లేదని, దీని వల్ల శాశ్వత నష్టం జరుగుతుందని అన్నారు. జాతరలో తల్లులకు సమర్పించిన బెల్లం భక్తులకు అందకుండా మధ్యలో దళారుల చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారు. దీనిపై మంత్రి సీతక్క ప్రత్యేకంగా దృష్టి పెట్టి దళారుల వ్యవస్థను తొలగించాలని కోరారు.ఎన్నికల ముందు సమ్మక్క తల్లి మీద ప్రమాణం చేసి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రైతులకు సాయం ఇప్పటికీ అందలేదని, వడగండ్ల వానకు పంట నష్టపోయిన ములుగు జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టే ముందు రైతులకు చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 4000 పెన్షన్ హామీ కూడా అమలు కాలేదని, ప్రజల్లో దీనిపై తీవ్ర అసంతృప్తి ఉందని తెలిపారు. ఈసారి బడ్జెట్‌లో దీనికి నిధులు కేటాయించకపోతే ప్రభుత్వానికి ప్రజా ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. మేడారం అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ఆధునీకరణకు మద్దతు ఇస్తామని, కానీ ప్లానింగ్ లేకుండా, ఆలస్యంగా, నాసిరకంగా చేస్తున్న పనులను మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు. క్యాబినెట్ మీటింగ్ పేరుతో పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారని, అసలు భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.