epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అన్ని రంగాల్లోనూ ‘కాంగ్రెస్’ విఫలం

అన్ని రంగాల్లోనూ ‘కాంగ్రెస్’ విఫలం
మళ్లీ పాత రోజులు దాపురించాయి!
తులం బంగారం ఇంకెప్పుడిస్తారు?
కల్యాణ లక్ష్మి లబ్ధిదారుల్లో నిరాశ.. కేసీఆర్ ఇచ్చిన లక్షే దిక్కు
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత
మబ్బులు చూసి రైతుల గుండెల్లో గుబులు.. కొనుగోలు కేంద్రాల్లో అస్తవ్యస్తం
కరెంట్ కోతలు, తాగునీటి కష్టాలతో అల్లాడుతున్న ప్ర‌జ‌లు
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

కాక‌తీయ‌, సూర్యాపేట : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, దివ్యాంగులకు త్రీ వీలర్ వాహనాలు మరియు అంగన్‌వాడీలకు మొబైల్ ఫోన్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. లబ్ధిదారుల్లో తీవ్ర నిరాశ కనిపిస్తోందన్నారు. “కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష రూపాయలే అందుతున్నాయి తప్ప, కాంగ్రెస్ హామీ ఇచ్చిన తులం బంగారం జాడ ఎక్కడ? ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్న మాటను త్వరగా నిలబెట్టుకోవాలి. దీనిపై ఇప్పటికే మహిళల్లో తీవ్ర చర్చ జరుగుతోంది” అని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ సెగ – ప్రభుత్వ పాపమే!
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారంటే అది కాంగ్రెస్ చేసిన పాపమేనని జగదీష్ రెడ్డి విమర్శించారు. “కార్మికుల సమస్యలను గాలికొదిలేయడం వల్లే వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ మరణాలకు కాంగ్రెస్ పార్టీయే పూర్తి బాధ్యత వహించాలి” అని పేర్కొన్నారు. ధాన్యం, మక్కల కొనుగోలు విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆకాశంలో మబ్బులు చూసి రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. అకాల వర్షాలు పడకముందే కొనుగోలు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలి. పేరుకే సెంటర్లు ప్రారంభిస్తున్నారు కానీ, కొనుగోళ్లు మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో రైతులు గత్యంతరం లేక దళారుల చేతిలో మోసపోతున్నారు. కేసీఆర్ గారి కంటే ముందున్న దళారీ వ్యవస్థే మళ్లీ రాష్ట్రంలో దాపురించింది” అని ఎద్దేవా చేశారు.

అంధకారంలో రాష్ట్రం..
రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగిపోయాయని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని హామీల అమలుపై, అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సారెస్పీ కాలువలతో రైతులను ఆదుకోవాలి

ఎస్సారెస్పీ కాలువలతో రైతులను ఆదుకోవాలి తుంగతుర్తి ప్రాంతానికి నీటిని విడుదల చేయాలి వర్షాభావంతో ఎండుతున్న...

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం సిమెంట్‌ బస్తాలు ఇస్తానంటూ ఇంటికి పిలిచిన...

శ్రీశైలం నీటిని ఏపీ తరలిస్తున్నా.. చూస్తూ ఊరుకుంటారా?

శ్రీశైలం నీటిని ఏపీ తరలిస్తున్నా.. చూస్తూ ఊరుకుంటారా? సాగర్‌ నీటిపై జిల్లా మంత్రులు...

బుల్లెట్ రైలు కారిడార్‌లో నకిరేకల్‌ను చేర్చాలి

బుల్లెట్ రైలు కారిడార్‌లో నకిరేకల్‌ను చేర్చాలి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు...

భువనగిరి రోడ్ల అభివృద్ధికి గడ్కరీకి ఎంపీ వినతి

భువనగిరి రోడ్ల అభివృద్ధికి గడ్కరీకి ఎంపీ వినతి కాకతీయ, భువనగిరి : భువనగిరి...

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్ములు అందజేత

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్ములు అందజేత కాకతీయ, తుంగతుర్తి: తాను చిన్ననాడు ఓనమాలు నేర్చిన...

మ‌హిళ‌ల‌కు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు

మ‌హిళ‌ల‌కు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య తుంగతుర్తిలో...

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు వినతిపత్రం అందజేత హైదరాబాదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.