epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఈ-కేవైసీ కష్టాలు

  • ఈ-కేవైసీ చిక్కులతో వేలాది కుటుంబాలకు టెన్షన్
  • దేళ్లలోపు పిల్లలకు నిలిచిన బయోమెట్రిక్ ప్రక్రియ
  • గడువు సమీపిస్తున్న వేళ తల్లిదండ్రుల ఆవేదన

కాక‌తీయ‌, ములుగు ప్ర‌తినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ లో పారదర్శకత పెంచేందుకు రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి చేసిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రేషన్ కార్డులో సభ్యులుగా నమోదైన ఐదేళ్లలోపు చిన్నారులకు ఈ-కేవైసీ చేయించే అవకాశం లేకపోవడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన గడువు సమీపిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అనేక మంది లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేయలేకపోయారు. ఇంటర్నెట్ సమస్యలు, బయోమెట్రిక్ పరికరాల కొరత, అవగాహన లోపం, దూర ప్రాంతాల్లో మీ సేవా కేంద్రాలు లేకపోవడం వంటి కారణాలతో ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.

చిన్నారులకే పెద్ద సమస్య

ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు సమయంలో కేవలం ఫోటో, జనన వివరాలు మాత్రమే నమోదు చేస్తారు. వేలిముద్రలు, కంటి ఐరిస్ బయోమెట్రిక్ వివరాలు తీసుకోరు. దీంతో ప్రస్తుతం అమలవుతున్న బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం సాధ్యం కావడం లేదు. ఫలితంగా రేషన్ కార్డులో నమోదైన చిన్నారుల పేర్లు తొలగించబడతాయేమోనని తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డులో నుంచి చిన్నారుల పేర్లు తొలగిపోతే వారికి లభించే ఉచిత బియ్యం, ఇతర ప్రజా పంపిణీ ప్రయోజనాలు నిలిచిపోయే అవకాశం ఉందని కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా భవిష్యత్తులో కుటుంబ ఆరోగ్య అవసరాలకు ఆరోగ్యశ్రీ వంటి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలపై కూడా దీని ప్రభావం పడే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలన్న డిమాండ్

ఐదేళ్లలోపు పిల్లల కోసం ప్రత్యేక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. బయోమెట్రిక్ అవసరం లేకుండా ప్రత్యామ్నాయ ధ్రువీకరణ పద్ధతిని అమలు చేయాలని, పిల్లల పేర్లు తొలగించకుండా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఈ-కేవైసీ గడువును కూడా పొడిగించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.