600 కేజీల చక్కెర పట్టివేత
కాకతీయ, పెద్దవంగర : నాటుసారా తయారీకి వినియోగించే 600 కేజీల చక్కెరను సరఫరా చేస్తున్న వ్యక్తిని పెద్దవంగర మండల పోలీస్ లు పట్టుకొని అరెస్ట్ చేశారు.ఎస్సై ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మొన్న తోర్రుర్ మండలంలోని అమర్సింగ్ తండకు చెందిన ఇద్దరు యువకులు పెద్దవంగర మండలంలో 15లీటర్ల గుడుంబను సరపర చేస్తుండగా పట్టుకొని నాటుసారకు ఉపయోగించే బెల్లం ఎక్కడి నుండి తెస్తున్నారని అడగక బెల్లం కాదు చక్కెర అని చెప్పడంతో ఆ షాప్ వివరాలు తెలుసుకోని తోర్రుర్ మండలంలోని శ్రీమాత ట్రేడర్స్ షాప్ ను తనిఖీ చేసి 12 బస్తాలు చక్కరను పట్టుకున్నారు. అనంతరం షాప్ నడుపుతున్న శ్రీధర్ ను అరెస్ట్ చేశామని తెలిపారు.

