epaper
Thursday, October 8, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చెరబండరాజు కాలనీలో గుడిసెల కూల్చివేతపై ఉద్రిక్తత..

చెరబండరాజు కాలనీలో గుడిసెల కూల్చివేతపై ఉద్రిక్తత..

పేదల ఇళ్ల తొలగింపు.. పోలీసులతో కాలనీవాసుల వాగ్వాదం..

బాధితులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న దాస్యం వినయ్‌భాస్కర్‌ హౌస్‌ అరెస్ట్‌..

ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చే రాజ్యమా?.. మాజీ ఎమ్మెల్యే ప్రశ్న..

గుడిసెలు కూల్చి మమ్మల్నే అరెస్ట్‌ చేశారంటూ బాధితుల ఆవేదన..

తెల్లవారుజామునే భారీగా పోలీసులు.. హామీలు అమలు కాలేదని బాధితుల ఆరోపణ..

కాకతీయ, వరంగల్‌ బ్యూరో : వరంగల్‌ భద్రకాళి ఆలయ సమీపంలోని చెరబండరాజు కాలనీలో గుడిసెల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. కుడా అధికారులు, మట్టెవాడ పోలీసులు బుధవారం ఉదయం కాలనీలోకి చేరుకుని గుడిసెల తొలగింపు చర్యలు చేపట్టడంతో బాధితులు తీవ్రంగా ఆందోళనకు దిగారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ మహిళలు, కాలనీవాసులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కాలనీవాసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు బాధితులు తెలిపారు. చెరబండరాజు కాలనీలో గుడిసెల కూల్చివేతకు అధికారులు చర్యలు చేపట్టడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అధికారుల సమక్షంలో గుడిసెల తొలగింపు కొనసాగుతుండగా, తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయ నివాసాలు కల్పించిన తర్వాతే ఇళ్లను తొలగించాలని డిమాండ్‌ చేశారు.

అడ్డుకున్న మహిళలతో వాగ్వాదం..

కూల్చివేతను అడ్డుకునేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో ముందుకు రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులను అడ్డుకున్న కొందరు మహిళలతో పోలీసులు వాగ్వాదానికి దిగినట్లు కాలనీవాసులు తెలిపారు. సీఐ కరుణాకర్‌ తీరుపై మహిళలు, కాలనీవాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. కూల్చివేతను అడ్డుకున్న వారిని పోలీసులు అక్కడి నుంచి తొలగించి అదుపులోకి తీసుకున్నట్లు బాధితులు ఆరోపించారు. తాము ఎన్నో ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, ఒక్కసారిగా ఇళ్లు కూల్చివేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. తమ పిల్లలు, వృద్ధులు, కుటుంబ సభ్యులతో ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, ప్రత్యామ్నాయంగా ఇళ్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

కలెక్టర్‌ను కలిసి మొరపెట్టుకున్నా..

కాలనీ సమస్యపై బాధితులు మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. తమకు ఇళ్లు, ఉపాధి కల్పిస్తామని గతంలో హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయకుండా ఇప్పుడు గుడిసెలను తొలగించడం అన్యాయమని వారు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తమ ఇళ్లు తమకు కావాలని, తమను ప్రభుత్వం మోసం చేయవద్దని కోరినట్లు తెలిపారు. గతంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కూడా తమకు భరోసా ఇచ్చారని బాధితులు పేర్కొన్నారు. అయితే ఆ హామీలు అమలు కాకుండానే గుడిసెలను కూల్చివేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలను నమ్మి మోసపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం..

ఇళ్ల కూల్చివేతతో తీవ్ర ఆవేదనకు గురైన కొందరు బాధితులు తమకు న్యాయం చేయాలంటూ పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసుల చర్యల్లో ఒక కాలనీవాసి గాయపడినట్లు బాధితులు ఆరోపించారు. తమ ఇళ్లను కూల్చివేసిన తర్వాత తమ నిరసనను అణచివేసేందుకు తమనే అరెస్ట్‌ చేయడం ఏమిటని బాధితులు ప్రశ్నించారు. మా ఇల్లు కూల్చి మమ్మల్నే అరెస్ట్‌ చేశారు. మాకు న్యాయం చేయండి అంటూ పోలీస్‌స్టేషన్‌లోనూ ఆందోళన నిర్వహించినట్లు తెలిపారు. తమకు శాశ్వత పరిష్కారం చూపే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వినయ్‌భాస్కర్‌..

కాలనీవాసుల సమస్య తెలుసుకుని వారికి సంఘీభావం తెలిపేందుకు ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ చెరబండరాజు కాలనీకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆయనను అడ్డుకున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయనను హౌస్‌ అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నాయి. పోలీసుల నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఆయన బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. వినయ్‌భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన అనుచరులు, పోలీసుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. బాధితుల తరఫున మాట్లాడేందుకు వెళ్తున్న తనను ఎందుకు అడ్డుకుంటున్నారని వినయ్‌భాస్కర్‌ పోలీసులను ప్రశ్నించినట్లు ఆయన వర్గాలు తెలిపాయి.

ఇందిరమ్మ రాజ్యం.. ఇల్లు కూల్చే రాజ్యమా..?

ఈ సందర్భంగా దాస్యం వినయ్‌భాస్కర్‌.. మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లు కూల్చే రాజ్యమా? అని ప్రశ్నించారు. మార్పు తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి పేదల నివాసాలను తొలగించడం ఏమిటని నిలదీశారు. అభివృద్ధి, బాగు చేస్తామని చెప్పి బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చడం సరికాదని ఆయన పేర్కొన్నారు. పేదలు తమ సమస్యలను చెప్పుకునే హక్కు ఉందని, వారి తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం సరికాదని వినయ్‌భాస్కర్‌ అన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు, అరెస్టులతో ఒత్తిడి తీసుకురావడం ద్వారా సమస్య పరిష్కారం కాదని పేర్కొన్నారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా పేదల పక్షాన నిలబడి పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. భద్రకాళి ఆలయ నిర్మాణం, అభివృద్ధికి గతంలో తమ ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు కేటాయించిందని వినయ్‌భాస్కర్‌ గుర్తుచేశారు. భద్రకాళి ఆలయ అభివృద్ధికి తాము ఎప్పుడూ సహకరిస్తామని, అదే సమయంలో ఆలయ పరిసరాల్లో నివసిస్తున్న పేదలకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. అభివృద్ధి పేరుతో పేదలపై అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

కూల్చివేతకు ముందు పునరావాసం కల్పించాలని డిమాండ్‌..

కాలనీవాసులకు ప్రత్యామ్నాయ నివాసాలు, పునరావాసం కల్పించిన తర్వాతే ఇళ్ల తొలగింపు చేపట్టాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. తమ కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా చర్యలు తీసుకోవద్దని కోరుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యపై స్పష్టమైన హామీ ఇచ్చి, తమ భవిష్యత్తుకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చెరబండరాజు కాలనీలో కూల్చివేత చర్యలు, బాధితుల నిరసన, పోలీసుల అదుపులోకి తీసుకోవడం, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ నిర్బంధం నేపథ్యంలో భద్రకాళి ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కల్తీ అల్లం..వెల్లుల్లి పేస్ట్ గుట్టు రట్టు

కల్తీ అల్లం..వెల్లుల్లి పేస్ట్ గుట్టు రట్టు ఏనుమాములలో టాస్క్ ఫోర్స్ దాడి అపరిశుభ్ర వాతావరణంలో...

ఏనుమాముల మార్కెట్ కు భద్రత కట్టుదిట్టం

ఏనుమాముల మార్కెట్ కు భద్రత కట్టుదిట్టం కమాండ్ కంట్రోల్ కు 120 సిసి...

ఈటల రాజేందర్‌ను కలిసిన బీజేపీ మండల నాయకులు

ఈటల రాజేందర్‌ను కలిసిన బీజేపీ మండల నాయకులు కాకతీయ, నెల్లికుదురు : భారతీయ...

తల్లి బిడ్డ క్షేమం కోసం అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలి

తల్లి బిడ్డ క్షేమం కోసం అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలి :సిడిపిఓ శిరీష కాకతీయ, ఇనుగుర్తి:...

రాహుల్ గాంధీ అరెస్టు కేంద్ర నిరంకుశత్వానికి నిదర్శనం

రాహుల్ గాంధీ అరెస్టు కేంద్ర నిరంకుశత్వానికి నిదర్శనం డీసీసీ అధ్యక్షుడు అయూబ్ వరంగల్ లో...

జర్నలిజంపై దాడులు సహించం

జర్నలిజంపై దాడులు సహించం వర్ధన్నపేట ఎమ్మెల్యేకు జర్నలిస్టుల హెచ్చరిక కాకతీయ, వరంగల్ ప్రతినిధి :...

బతుకమ్మ, దసరా వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు చేయండి

బతుకమ్మ, దసరా వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు చేయండి జిడబ్ల్యుఎంసి కమిషనర్ వెంకన్న భక్తులకు...

బస్సు చక్రాల కింద విద్యార్థి దుర్మరణం

బస్సు చక్రాల కింద విద్యార్థి దుర్మరణం కాకతీయ, నెక్కొండ:వరంగల్ జిల్లా నెక్కొండ మండలం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.