బస్సు చక్రాల కింద విద్యార్థి దుర్మరణం
కాకతీయ, నెక్కొండ:వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పిట్టకాలుబోడు తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యోదయ హైస్కూల్‌కు చెందిన పాఠశాల బస్సు కింద పడి ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సు చక్రాలు విద్యార్థిపై నుంచి వెళ్లడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందినట్లు సమాచారం.ఈ ఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

